జబర్దస్త్ వేస్ట్.. టోటల్ వేస్ట్.. బాబా మాస్టర్ సెన్సేషనల్ కామెంట్స్

Baba Bhaskar About Jabardasth SHow For DJ Event

పండుగలు వస్తుంటే.. బుల్లితెరపై సందడి రెట్టింపు అవుతోంది. మరీ ముఖ్యంగా ఈటీవీలో ప్రతీ పండుగకు స్పెషల్ ఈవెంట్ జరుగుతూనే ఉంటుంది. అయితే ఆ ఈవెంట్లలో జబర్దస్త, ఢీ అన్న తేడాలేవీ లేకుండా అందరూ కలిసిపోయి రచ్చ చేసేశారు. ఈ సారి కాస్త వెరైటీగా ఉండేందుకు మంచి ప్లానే వేశాడు. డిసెంబర్ 31 రాత్రి పార్టీ అంటూ ఓ డ్రామా ఆడారు. జబర్దస్త్ ఆర్టిస్ట్‌లు ఢీ షో వేదికపైప్రత్యక్షమయ్యారు. డిసెంబర్ 31 రాత్రి పార్టీ పార్టీ చేసుకునేందుకు ఢీ వేదిక కావాలని ధమ్‌కి ఇచ్చారు.

Baba Bhaskar About Jabardasth SHow For DJ Event

శేఖర్ మాస్టర్, హైపర్ ఆది, సుధీర్, ప్రదీప్ ఇలా అందరికీ అభి, తాగుబోతు రమేష్‌లు వార్నింగ్ ఇచ్చారు. ఆ రోజు రాత్రి మేం పార్టీ చేసుకోవాలని ఢీ స్టేజ్ మాకు అప్పగించాలని హెచ్చిరించారు. శేఖర్ మాస్టర్ అందుకు ఒప్పుకోకపోవడంత్ ఢీ డ్యాన్సర్లను కిడ్నాప్ చేశామని తెలిపారు. మాకు స్టేజ్ అప్పగిస్తేనే మీ కంటెస్టెంట్లను మీకు అప్పగిస్తామని డ్రామా క్రియేట్ చేశాడు. ఇక శేఖర్ మాస్టర్, ఢీ టీం కలిసి జబర్దస్త్‌కు ధమ్‌కి ఇచ్చేందుకు బాబా భాస్కర్‌ను రంగంలోకి దించారు.

జబర్దస్త్ వేదికపై రోజాకు అభి ఢీ షో వాళ్లు చేసిన కామెంట్ల గురించి చెప్పాడు. మనం పార్టీ చేసుకుంటానంటే స్టేజ్ ఇవ్వడం లేదు.. మనకువార్నింగ్ ఇచ్చేందుకు ఓ వీడియో పంపాడని చెప్పాడు. ఆ వీడియోలో జబర్దస్త్ షోపై బాబా భాస్కర్ దారుణంగా కామెంట్లు చేశాడు. శేఖర్ మాస్టర్ అమాయకుడని, వచ్చి బెదిరిస్తారా? పిల్లలను ఎత్తుకెళ్తారా? అని వార్నింగ్ ఇచ్చాడు. జబర్దస్త్ షో నే వేస్ట్.. టోటల్ వేస్ట్.. టోటల్ వేస్ట్ కూడా తక్కువే.. వేరే లెవెల్ వేస్ట్ అంటూ ధమ్ కీ ఇవ్వడంతో జబర్దస్త్ టీం సమరానికి రంగంలో దిగింది. ఇలా డీజే అంటూ డిసెంబర్ 31న కొత్తరకం ఈవెంట్‌తో ముందుకు రాబోతోన్నారు.