ప్రభాస్ పెళ్లి ఫిక్స్.. అమ్మాయి ఎవరో తెలిస్తే షాక్ అవుతారు!!

ఇండస్ట్రీలో ప్రభాస్ పేరు తెలియని వ్యక్తి ఎవరు ఉండరు. ఇటు సౌత్ నుండి నార్త్ వరకు ఇండియాలో అందరికీ ప్రభాస్ సుపరిచితుడే. 2002లో ఈశ్వర్ సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన ప్రభాస్ తర్వాత బిల్లా, చత్రపతి వంటి సినిమాలతో మాస్ ఆడియన్స్ కి, వర్షం, మిస్టర్ పర్ఫెక్ట్, డార్లింగ్ లాంటి సినిమాస్ తో క్లాస్ ఆడియన్స్ కి కనెక్ట్ అయిపోయాడు.

బాహుబలి తర్వాత ప్రభాస్ రేంజ్ ఏ స్థాయికి చేరిందో అందరికీ తెలిసిందే. ఎక్కడ చూసినా ప్రభాస్ హవా యే ఉండేది. తెలుగు ఇండస్ట్రీని ఒక రేంజ్ కి తీసుకెళ్లిన ఘనత ప్రభాస్ కి సొంతం. అయితే ఇంత పెద్ద స్టార్ అయిన ప్రభాస్ కి 45 ఏళ్లు వచ్చిన సరే ఇంకా పెళ్లి కాకపోవడం పెద్ద మిస్టరీగా మిగిలింది. తన తోటి యాక్టర్స్ అందరూ పెళ్లి చేసుకొని పిల్లల్ని కూడా కనేస్తుంటే ప్రభాస్ మాత్రం ఇంకా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఆఫ్ ఇండియా గా మిగిలిపోతున్నాడు.

దీనికి కారణం గతంలో జరిగిన బ్రేకప్స్ అని కొందరు అనగా మరి కొందరు అనుష్కతో ప్రేమలో ఉండడం వల్ల అని అంటున్నారు. ఇన్ని సంవత్సరాలలో ప్రభాస్ పెళ్లి గురించి చాలా వార్తలు వచ్చాయి కానీ అవి వార్తలు గానే మిగిలిపోయాయి. కానీ ఈసారి ప్రభాస్ పెళ్లి ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయింది అని గట్టిగా వార్తలు వస్తున్నాయి. కానీ పెళ్లికూతురు ఎవరో తెలిస్తే అందరూ షాక్ అవుతారు. ఎందుకంటే ఆమె ఇండస్ట్రీకి చెందిన మనిషి కాదట. ప్రభాస్ కుటుంబంలో ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడట.

అయితే ఆ అమ్మాయికి ఆస్తిపాస్తులు గట్టిగా ఉన్నాయి అంటూ వార్తలు వస్తున్నాయి. ఈసారైనా ఈ వార్త నిజమయ్యి ప్రభాస్ పెళ్లి పీటల మీదకు చేరితే అంతకన్నా ఆనందం ప్రభాస్ ఫ్యాన్స్ కి ఇంకేముండదు. ఇకపోతే ప్రభాస్ తదుపరి చిత్రం అయిన రాజా సాబ్ వచ్చే సంవత్సరం ఏప్రిల్ లో విడుదలకు దగ్గరగా ఉంది. ఈ సినిమా కోసం ఆయన ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు.