క్రేజీ గాసిప్ : మరోసారి ప్రభాస్, అనుష్క అదే భారీ నిర్మాణ సంస్థ.?

టాలీవుడ్ సినిమా దగ్గర బిగ్ స్క్రీన్ పై ఓ జంటని చూడాలని ఆడియెన్స్ బాగా ఇష్టపడే పెయిర్ లో అయితే పాన్ ఇండియా హీరో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అలాగే స్వీటీ అనుష్క ల జంట కూడా ఒకటి. వీరిద్దరి పెయిర్ కి ఉన్న క్రేజ్ అయితే అంతా ఇంతా కాదు.

పైగా వీరి కాంబినేషన్ లో వచ్చిన అన్ని సినిమాలు కూడా భారీ హిట్ లే అయ్యాయి. అలాగే వసూళ్ల పరంగా కూడా సెన్సేషనల్ ట్రాక్ రికార్డు వీరికి ఉంది. అయితే బాహుబలి సిరీస్ తో ఎండ్ అయ్యిన వీరి చిత్రాలు ఇప్పుడు మరోసారి అయితే స్క్రీన్ పంచుకోనున్నట్టుగా ఇప్పుడు రూమర్స్ వినిపిస్తున్నాయి.

కాగా ఈ చిత్రాన్ని అయితే భారీ స్కేల్ లోనే అది కూడా బాహుబలి నిర్మాణ సంస్థ అయినటువంటి ఆర్కా మీడియా వారు ప్లాన్ చేస్తున్నట్టుగా రూమర్స్ వినిపిస్తున్నాయి. అంతే కాకుండా ఈ చిత్రాన్ని కూడా ఓ ప్రముఖ స్టార్ దర్శకుడే టేకప్ చేస్తున్నట్టుగా కూడా రూమర్స్ వినిపిస్తున్నాయి. దీనితో ఈ సెన్సేషనల్ గాసిప్ ఇప్పుడు సినీ వర్గాల్లో వైరల్ గా మారింది.

బిల్లా, మిర్చి, బాహుబలి లాంటి బిగ్గెస్ట్ హిట్స్ ప్రభాస్, అనుష్క నుంచి ఉండగా ఇక మరోసారి కొలాబరేషన్ అంటే ఆ క్రేజ్ ఎలా ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు. మరి వేచి చూడాలి ఎంతవరకు ఈ కాంబినేషన్ సెట్ అవుతుంది అని అనేది. ఇక ఇపుడు ప్రభాస్ అయితే పలు పాన్ ఇండియా నుంచి పాన్ వరల్డ్ చిత్రాలు చేస్తుండగా అనుష్క తన కం బ్యాక్ చిత్రం మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి తో రాబోతుంది.