రీ-రిలీజ్ ట్రెండ్ – టాప్ 5 బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ ఇవే!

పాత సినిమాలను మళ్లీ విడుదల చేయడం టాలీవుడ్‌లో ట్రెండ్‌గా మారింది. అభిమానులు తమ అభిమాన హీరోల సినిమాలను మరోసారి వెండి తెరపై చూసేందుకు ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు. మొత్తానికి ఈ ట్రెండ్ విజయవంతమైంది. చాలా సినిమాలు కలెక్షన్ల పరంగా రికార్డులను బద్దలు కొట్టాయి.

రీ-రిలీజ్ అయిన టాప్ 5 సినిమా కలెక్షన్లలో పవన్ కళ్యాణ్ ఖుషి జల్సా, మహేష్ బాబు ఒక్కడు, రామ్ చరణ్ ఆరెంజ్, అలాగే ప్రభాస్ బిల్లా ఉన్నాయి. 4కే రీ-రిలీజ్ ద్వారా 5.50 కోట్ల గ్రాస్ వసూళ్లతో ఖుషీ ప్రస్తుతం టాప్‌లో ఉంది.

టాలీవుడ్‌లో రీ-రిలీజ్ అయిన టాప్ 5 సినిమా కలెక్షన్లు ఈ విధంగా ఉన్నాయి:

ఖుషి 4K – 5.50 Cr
జల్సా 4K – 3.20 Cr
ఆరెంజ్ – 3.12 కోట్లు
ఒక్కడు – 2.14 కోట్లు
పోకిరి 4K – 1.75 Cr
బిల్లా 4K – 1.5 Cr

ఇక రాబోయే ఏదైనా రీ-రిలీజ్ సినిమా ఈ రికార్డులను బ్రేక్ చేయగలదా? లేదా అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. దేశముదురు 4K, సింహాద్రి 4K రెండు సినిమాలు కూడా ఇప్పుడు రీ-రిలీజ్‌ కు వచ్చేశాయి. అయితే ఖుషీ 5.50 కోట్ల రికార్డును ఈ సినిమాలు బ్రేక్ చేసే అవకాశం తక్కువే. మరి మొత్తంగా బన్నీ, అల్లు అర్జున్ సినిమాలు ఎంతవరకు సక్సెస్ అవుతాయో చూడాలి.