Home Entertainment 'అయ్యప్పనుమ్ కోషియమ్' రీమేక్ .. సెట్స్ లో అడుగుపెట్టిన పవన్ !

‘అయ్యప్పనుమ్ కోషియమ్’ రీమేక్ .. సెట్స్ లో అడుగుపెట్టిన పవన్ !

టాలీవుడ్ అగ్రనటుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రాణాదగ్గుబాటి ల కాంబినేషన్ లో యువ నిర్మాత సూర్యదేవర నాగవంశీ సితార ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై ప్రొడక్షన్ నం:12 గా నిర్మిస్తున్న చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అయింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పాల్గొనగా యాక్షన్ సన్ని వేశాలకు శ్రీకారం చుట్టారు చిత్ర దర్శకుడు సాగర్.కె.చంద్ర. సితార ఎంటర్ టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే- సంభాషణలు సుప్రసిద్ధ దర్శకుడు, రచయిత ‘త్రివిక్రమ్‘ అందిస్తున్న విషయం తెలిసిందే.

Power Star 'Ake' Remake Shooting Starts ..!

షూటింగ్ ప్రారంభమైన విషయాన్ని వెల్లడిస్తూ తుపాన్ మొదలైంది అంటూ మేకర్స్ ఓ వీడియో రిలీజ్ చేశారు. ఈ వీడియోలో షూటింగ్ కోసం జరుగుతున్న సన్నాహాలను చూపిస్తూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సెట్స్ లో అడుగుపెట్టడం చూపించారు. దీనికి మ్యూజిక్ డైరెక్టర్ థమన్ అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. పవన్ బైక్ పై ఓ లాడ్జిలోకి ఎంటర్ అయ్యే సీన్స్ ని షూట్ చేసినట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో పవన్ నిజాయితీ గల పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నాడు.

మలయాళ రీమేక్ అయినప్పటికీ త్రివిక్రమ్ తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా స్క్రిప్ట్ లో తగినన్ని మార్పులు చేర్పులు చేసినట్లు తెలుస్తోంది.ఇక ఈ సినిమాలో హీరోయిన్లు సాయి పల్లవి, ఐశ్వర్య రాజేష్ కూడా పాల్గొంటారని తెలుస్తోంది. ఇక, ఈ చిత్రానికి బిల్లా రంగ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. ఇందులో సముద్రఖని కీలకమైన పాత్రను పోషిస్తున్నట్లు ఇప్పటికే రివీల్ చేశారు. ఈ ప్రతిష్టాత్మక సినిమాకు యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ ఎస్ ఎస్ థమస్ సంగీతం సమకూర్చుతున్నాడు. 

- Advertisement -

Related Posts

త‌ర్వాతి సినిమాలో రెట్రో లుక్‌తో క‌నిపించనున్న ఉస్తాద్ హీరో..!

యంగ్ అండ్ ఎన‌ర్జిటిక్ హీరో రామ్ పంథా మార్చాడు. ఒక‌ప్పుడు ల‌వ‌ర్ బోయ్ పాత్ర‌ల‌తో అల‌రించిన రామ్ ఇప్పుడు మాస్ మ‌సాలా లుక్స్‌తో ప్రేక్ష‌కుల‌కు పసందైన వినోదాన్ని అందించేందుకు సిద్ధ‌మ‌య్యాడు. పూరీ జ‌గ‌న్నాథ్...

పునర్నవి అందాల విందు.. పిక్స్ వైరల్

బిగ్ బాస్ బ్యూటీ పునర్నవి సోషల్ మీడియాలో చేసే అల్లరి అంతా ఇంతా కాదు. అయితే సోషల్ మీడియాలో పది మందికి పనికి వచ్చే విషయాలను పంచుకుంటూ ఉంటుంది. వ్యాయామం, సౌందర్య చిట్కాలు,...

Shriya Saran Recent Photos

Shriya Saran ,Telugu Most popular Actress Shriya Saran Recent Photos,Actress Tollywood Shriya Saran Recent Photos Shooting spotphotos,Shriya Saran , Shriya Saran Recent Photos,

Kriti Sanon New Pictures

Kriti Sanon ,Hindi Most popular Actress Kriti Sanon New Pictures,Actress Bollywood Kriti Sanon New Pictures Shooting spotphotos,Kriti Sanon ,Kriti Sanon New Pictures ,

Latest News