నాని బర్త్ డే కి బ్యాక్ టు బ్యాక్ సర్‌ప్రైజెస్.. ఫ్యాన్స్ కి పండుగే..!

నాని వరసగా సినిమాలని సెట్స్ మీదకి తీసుకు రావడమే కాదు ఈ ఏడాదిలోనే అన్ని సినిమాలని రిలీజ్ చేయనున్నాడు. శివ నిర్వాణ దర్శకత్వంలో టక్ జగదీష్ సినిమాలో నటించాడు నాని. ఈ సినిమాలో రీతు వర్మ, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్స్ గా నటించారు. షైన్ స్క్రీన్ బ్యానర్ పై హరీష్ పెద్ది, సాహు గారపాటి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కాగా ఈ సినిమా రిలీజ్ కి రెడీగా ఉంది. సమ్మర్ కానుకగా ఏప్రిల్ 23 న ఈ సినిమా రిలీజ్ చేయబోతున్నట్టు మేకర్స్ ఇప్పటికే అధికారకంగా ప్రకటించారు.

ఇక ఈ సినిమా తర్వాత నాని శ్యామ్ సింగ రాయ్ – అంటే సుందరానికి సినిమాలతో రాబోతున్నాడు. ప్రస్తుతం శ్యామ్ సింగ రాయ్ సినిమా షూటింగ్ దశలో ఉంది. కాగా అంటే సుందరానికి సినిమా షూటింగ్ మొదలవాల్సి ఉంది. ఇక నాని శ్యామ్ సింగ రాయ్ కలకత్తా బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతుండగా ఈ సినిమా కి టాక్సీవాలా ఫేం రాహుల్ సంకృత్యన్ దర్శకత్వం వహిస్తున్నాడు. సాయి పల్లవి, కృతిశెట్టి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇక ఈ సినిమా కూడా సమ్మర్ లో రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు మేకర్స్. అయితే ఈ మూడు సినిమాల కి సంబంధించిన అప్‌డేట్స్ రాబోతున్నాయి.

ఈ నెల 24 న నేచురల్ స్టార్ నాని బర్త్ డే సందర్భంగా శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందిన ‘టక్ జగదీష్’ సినిమా టీజర్ ను విడుదల చేయబోతున్నారు. అలాగే నాని శ్యామ్ సింగరాయ్ సినిమా నుండి ఫస్ట్ లుక్ ను విడుదల చేయబోతున్నారు. ఇక మిగిలిన అంటే సుందరానికి సినిమాకి సంబంధించి ఎలాంటి అప్‌డేట్ ఇవ్వబోతున్నారు అన్నది తెలియాల్సి ఉంది. ఇంకా ఈ సినిమా షూటింగ్ మొదలవలేదు కాబట్టి ఎలాంటి అప్‌డేట్ ఇస్తారన్నది సస్పెన్స్ గా ఉంది. మొత్తానికి నాని నుంచి ఈ నెల 24 న మూడు సర్‌ప్రైజింగ్ అప్‌డేట్స్ ఇవ్వబోతున్నాడు. ఇక నాని ఫ్యాన్స్ కి పండుగే.