శ్యామ్ సింగరాయ్ ఫస్ట్ లుక్ పోస్టర్ లో నాని వెనక ఉన్న హీరోయిన్ తనే ..!

శ్యామ్ సింగరాయ్ నేచురల్ స్టార్ నాని నటిస్తున్న తాజా చిత్రం. రీసెంట్ గా నాని బర్త్ డే సందర్భంగా ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేశారు చిత్ర బృందం. ఐతే ఇనాళ్ళు ఈ సినిమా టైటిల్ చూసి ఎలాంటి లుక్ లో నాని కనిపిస్తాడో అని అందరూ ఆసక్తిగా మాట్లాడుకున్నారు. ఆ ఆసక్తిని రెట్టింపు చేసే విధంగా శ్యామ్ సింగరాయ్ లో నాని ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేసి మేకర్స్ షాకిచ్చారు. ఈ సినిమాలో నాని లుక్ ఇలా ఉంటుందని ఏ ఒక్కరు ఊహించలేదు. టాక్సీవాలా సినిమాతో దర్శకుడిగా అందరి ప్రశంసలు అందుకున్న రాహుల్ సంకృత్యన్ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు.

Shyam Singha Roy 250221 1200 Poster | Telugu Rajyam

కాగా ఈ సినిమాలో నాని డ్యూయల్ రోల్ లో కనిపించబోతున్నాడని తెలుస్తోంది. పునర్జన్మల నేపథ్యంలో శ్యామ్ సింగరాయ్ సినిమా తెరకెక్కుతుందట. కలకత్తా బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ఎక్కువ భాగం కలకత్తాలోనే చిత్రీకరణ జరుపుతున్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా నుంచి తాజాగా రిలీజైన ఫస్ట్ లుక్ పోస్టర్ ఎంగతా ఆకట్టుకుందో అంత క్యూరియాసిటీని పెంచింది. అలా పెరగడానికి కారణం మేకర్స్ తాజాగా రిలీజ్ చేసిన పోస్టర్ లో నాని ని హీరోయిన్ వెనక నుంచి కౌగిలించుకొని ఉంది. కంప్లీట్ గా హీరోయిన్ ని హైడ్ చేయడంతో అందరిలో ఈ హీరోయిన్ ఎవరై ఉంటారన్నదే హాట్ టాపిక్ గా మారింది.

అయితే విశ్వసనీయ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం నాని ని వెనక నుంచి కౌగిలించుకుని ఉన్న హీరోయిన్ సాయి పల్లవి అని తెలుస్తోంది. ఈ సినిమాలో సాయి పల్లవి బెంగాలి అమ్మాయిగా కనిపించబోతోందట. ఇక ఉప్పెన సినిమాతో టాలీవుడ్ లో గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చిన కృతి శెట్టి మరోక హీరోయిన్ గా నటిస్తోంది. నిహారిక ఎంటర్‌టైనెమెంట్స్ బ్యానర్ పై వెంకట్ బోయినపల్లి ఈ సినిమాని నిర్మిస్తున్నాడు. మడోనా స్టెబాస్టియన్ మరో హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నాడు. ఇక నాని ఈ ఏడాదిలో ముందు టక్ జగదీష్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

Related Articles

Gallery

- Advertisement -

Recent Articles