ఈ 45 కోట్ల క్రేజ్ నాగ చైతన్యదా.. సాయి పల్లవిదా ?

Main Reason Behind Love Story Business
Naga Chaitanya and sai Palavi

నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం ‘లవ్ స్టోరీ’. శేఖర్ కమ్ముల దర్శకుడు. ఈ సినిమా మీద మొదటి నుండి పాజిటివ్ బజ్ ఉంది. ఈమధ్య విడుదలైన టీజర్, ‘సారంగ దరియా’ పాటతో సినిమా క్రేజ్ అమాంతం పెరిగింది. పాటకు మిలియన్ల వ్యూస్ వస్తున్నాయి. ఈ పాట ఇంతలా హిట్ కావడానికి కారణం సాయి పల్లవి. క్రెడిట్ పూర్తిగా ఆమెకే దక్కుతుంది. ఇక సినిమా బిజినెస్ కూడా భారీగానే జరుగుతోంది. కేవలం ఆంధ్రా ఏరియా బిజినెస్ 15 కోట్లు ఉంది. ఓవర్సీస్ 6 కోట్లు అంటున్నారు. ఇక అతిపెద్ద మార్కెట్ తెలంగాణ, ఇతర ఏరియాలు కలుపుకుంటే ఆ మొత్తం 45 కోట్ల వరకు ఉంటోంది.

నిజానికి నాగ చైతన్య గత సినిమాలకు ఈ స్థాయి బిజినెస్ జరిగింది లేదు. ఇదే పెద్దది ఈ సినిమాకు ఇంతలా క్రేజ్ ఏర్పడటానికి కారణం ఏంటి అంటే సాయి పల్లవి పేరు గట్టిగా వినిపిస్తోంది. యూత్ ప్రేక్షకుల్లో సాయి పల్లవికి మంచి క్రేజ్ ఉంది. ఇలాంటి ప్రేమ కథలకు ఆమె బాగా నప్పుతుందనే కాన్ఫిడెన్స్ ఉంది. గతంలో సాయి పల్లవి, శేఖర్ కమ్ముల చేసిన ‘ఫిదా’ రికార్డ్ స్థాయి కలెక్షన్లను రాబట్టింది. ఆ సినిమా అంతలా హిట్ కావడానికి కారణం సాయి పల్లవి అనేది నిర్వివాదాంశం. అందుకే మరోసారి శేఖర్ కమ్ముల డైరెక్షన్లో ఆమె చేసిన సినిమా కాబట్టే ఈ స్థాయిలో బిజినెస్ జరిగిందని కొందరు అంటున్నారు. ఇక జరిగిన బిజినెస్ వెనక్కు రావాలంటే సినిమా ఆల్మోస్ట్ ‘ఉప్పెన’ స్థాయిలో ఇన్స్టంట్ హిట్ కావాలి. లేదా ‘ఫిదా’ తరహాలో హెల్తీ లాంగ్ రన్ చేయాలి. మరి ‘ఫిదా’తో చేసిన మ్యాజిక్ ఈ సినిమాతో కమ్ముల రిపీట్ చేస్తారో లేదో చూద్దాం.

Related Articles

Gallery

- Advertisement -

Recent Articles