చాన్స్ దొరికింది కదా అని పెట్టేశాడట.. అరియానాను వదలని అవినాష్

Avinash kiss to Ariyana 100 percent love

అరియానా అవినాష్ బుల్లితెరపై చేసే సందడి గురించి అందరికీ తెలిసిందే. ఆ ఇద్దరూ ఒకే చోట చేరారంటే అల్లరి ఓ రేంజ్‌లో ఉంటుంది. బుల్లితెరపై ఈ ఇద్దరి రొమాన్స్ మామూలుగా ఉండదు. కేవలం ఫ్రెండ్స్ అనే చెప్పుకుంటారు. కానీ ఆన్ స్క్రీన్‌కు వచ్చే సరికి మాత్రం రెచ్చిపోతుంటారు. రియల్ జంటల్లా నటిస్తుంటారు. అందులోనూ మరీ ముఖ్యంగా అవినాష్ మరింత దూకుడు ప్రదర్శిస్తుంటాడు.

Avinash kiss to Ariyana 100 percent love

దొరికిందే చాన్స్ కదా అని అరియానాను ఇష్టమొచ్చినట్టు చేసేస్తాడు. పైకి ఎత్తుకుంటాడు.. పట్టుకుంటాడు.. ముద్దులు కూడా పెట్టేస్తాడు. అయితే తాజాగా అసలు విషయం చెప్పేశాడు. స్టార్ మాలో వస్తోన్న 100 పర్సెంట్ లవ్ అనే ప్రోగ్రాం నేటి సాయంత్రం ప్రసారం కాబోతోంది. ఇందులో అరియానా అవినాస్ రీల్ జంటలుగా పార్టిసిపేట్ చేయబోతోన్నారు. అయితే ఇందులో ఓ పర్ఫామెన్స్ చేశారు ఆ ఇద్దరూ.

అల్లరి నరేష్ వర్షిణి చేసే పర్ఫామెన్స్‌పై సెటైర్ వేసిన అవినాష్‌ను రవి ఇరికించాడు. ఇదే పర్ఫామెన్స్‌ను అరియానాతో అవినాష్ చేస్తాడని చెప్పుకొచ్చాడు. అయితే అలా డ్యాన్స్ చేస్తూ అరియానాను నుదిటి మీద ముద్దుపెట్టేశాడు. అలా ఎందుకు చేశావ్.. దొరికిందే చాన్స్ కదా? అని చేశావ్ కదా అని రవి అన్నాడు. అవును దొరికిందే చాన్స్ అని ముద్దు పెట్టేశాను అని అవినాష్ అసలు విషయం చెప్పడంతో అరియానా తాటతీసింది.