మోనాల్ చేసిన హడావిడికి బిత్తరపోయిన అవినాష్ , అరియానా!

avinash ,ariyana shocked with monal shoutings

బిగ్ బాస్: తెలుగు బిగ్ బాస్ సీజన్ 4లో 13వ వారం నామినేషన్స్ లో ఐదుగురు హౌజ్ మేట్స్ నామినేట్ అయ్యారు. ప్రతి హౌజ్ మేట్ ముందు ఓ కంటైనర్ పెట్టి అందులో కలర్ వాటర్ పోసి నామినేట్ చేయమని అన్నారు. అయితే ఈవారం నామినేషన్ టాస్క్ లో సోహెల్, అరియానా తప్ప మిగిలిన ఐదుగురు నామినేషన్స్ లో ఉన్నారు. హారిక, అఖిల్ లకు ఒకే రకమైన కొలతలో కలర్ వాటర్ ఉండటంతో ఇద్దరిని నామినేట్ చేశాడు బిగ్ బాస్.

avinash vs monal

ఇక ఈ నామినేషన్స్ లో మోనాల్ చేసిన హడావిడికి జనాలు బిత్తరపోయారు.ఆమెని అఖిల్, అభిజిత్ ఏమన్నా సరే ఆమె నుండి ఆన్సర్ రాలేదు కాని అరియానా, అవినాష్ అంటే మాత్రం ఆమె ఎటాకింగ్ కు దిగుతుంది. అరియానాతో మాట్లాడుతున్న టైం లో అవినాష్ తెలుగు మాట్లాడు అని చెప్పినందుకు నేను మాట్లాడుతున్నా అంటూ పెద్దగా అరిచింది. మోనాల్ ఈ షాకింగ్ రెస్పాన్స్ చూసి మిగిలిన హౌజ్ మేట్స్ అంతా కూడా షాక్ అయ్యారు. అవినాష్ కూడా తెలుగులో మాట్లాడమనడం తప్పా.. అయినా వేరే వాళ్లు చెప్పిన అదే రీజన్ తాము చెబితే మాత్రం ఇలా రియాక్ట్ అవుతుందని మోనాల్ తప్పుని వేలెత్తి చూపే ప్రయత్నం చేశారు.

ఫైనల్ గా ఈ వీక్ నామినేషన్స్ లో మోనాల్ కూడా ఉంది. ఆమె ఇంత హడావిడి చేయకుండా ఉంటే ఓట్స్ పడేవేమో కాని మోనాల్ లాస్ట్ వీక్ సేఫ్ అయ్యే సరికి ఈ వీక్ కూడా సేఫ్ అవ్వుతాను అని ఆమెకు ఓవర్ కాన్ ఫిడెన్స్ వచ్చినట్టుగా ఉందని, అందుకే ఆమె ఇలా ప్రవరిస్తుందని అభిమానులు అనుకుంటున్నారు .