వైరల్ : కేవలం 75 రూపాయలకే “అవతార్” సినిమా..థియేటర్స్ లో ఎలాగంటే!

ప్రపంచ వ్యాప్తంగా రికార్డు గ్రాసింగ్ సినిమా ఉంది అంటే అది “అవతార్” సినిమానే అని అందరికీ తెలిసిందే. ఎప్పుడో సరైన టికెట్ రేట్స్, 3D లాంటివి లేకుండానే థియేటర్స్ లో ఆల్ టైం రికార్డు వసూళ్లు కొల్లగొట్టింది. ఇప్పటికీ కూడా ఈ సినిమా వసూళ్లే ప్రపంచంలో నెంబర్ 1 గా ఉన్నాయి అంటే అర్ధం చేసుకోవాలి ఈ సినిమా ఏ లెవెల్లో అప్పట్లో థెటర్స్ లో ఆడిందో అనేది.

అయితే ఇక ఈ సినిమాకి సీక్వెల్ ని దర్శకుడు జేమ్స్ కామెరాన్ తెరకెక్కించగా ఈ సినిమా ఈ ఏడాది డిసెంబర్ లో రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారు. అయితే దీనికన్నా ముందే మళ్ళీ అవతార్ 1 సినిమాని థియేటర్స్ లో ఈ సెప్టెంబర్ 23న రిలీజ్ కి ప్లాన్ చేశారు.

ఈసారి రీ మాస్టర్ చేసిన ప్రింట్ ని అలాగే సౌండ్ బహుశా 3D లో కూడా రిలీజ్ ఉన్నట్టు ఉంది. మరి ఈ భారీ సినిమా టికెట్ ధర అయితే సరైన మల్టీ ప్లెక్స్ లో కేవలం 75 రూపాయలకి మాత్రమే చూసి ఎంజాయ్ చెయ్యొచ్చు. ఇదెలా అంటే ప్రపంచ వ్యాప్తంగా సినిమా డే గా ఒక రోజుని ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే.

అయితే ఈ వరల్డ్ సినిమా డే ని మొదట ఈ సెప్టెంబర్ 16న ప్లాన్ చెయ్యగా అప్పుడు కూడా ఇదే 75 రూపాయలకి ఉంటాయని తెలిపారు. ఇప్పుడు ఈ డేట్ ని మరో వారానికి ప్రపంచ వ్యాప్తంగా వాయిదా వేసారట, దీనితో సెప్టెంబర్ 23న సరిగ్గా అవతార్ 1 రిలీజ్ డేట్ కి వచ్చింది. అంటే భారీ మల్టీ ప్లెక్స్ లలో ఆ ఒక్క రోజు అవతార్ సినిమాని కేవలం 75 రూపాయల టికే రేట్ లో చూసి ఎంజాయ్ చెయ్యొచ్చు.