బాక్సాఫీస్ : ఇండియాలో “అవతార్ 2” డే 1 వసూళ్లు డీటెయిల్స్!

పాన్ వరల్డ్ సినిమా దగ్గర ఇప్పుడు సెన్సేషన్ ని రేపుతున్న భారీ చిత్రం “అవతార్ 2” ని ప్రత్యేకంగా పరిచయం చెయ్యక్కర్లేదు. దర్శకుడు జేమ్స్ కామెరాన్ అద్భుత సృష్టి లో ఈ చిత్రం మరొకటి కాగా దీనిపై అయితే భారీ అంచనాలు నెలకొన్నాక అదిరే టాక్ తెచ్చుకొని ప్రపంచ వ్యాప్తంగా రికార్డు థియేటర్స్ లో ఈ చిత్రం రిలీజ్ అయ్యింది.

మరి ఈ సినిమా రిలీజ్ ఇండియా లో కూడా సుమారు 5000 థియేటర్స్ లో కాగా ఇండియా లో ఈ చిత్రం రికార్డు బ్రేకింగ్ వసూళ్లు నమోదు చేస్తుంది అని అయితే అంతా అనుకున్నారు. మరి దీనికి ముందు అయితే అవెంజర్స్ ఎండ్ గేమ్ చిత్రం 50 కోట్లకి పైగా గ్రాస్ తో ఉండగా దీనిని బ్రేక్ చెయ్యొచ్చు అనే ట్రేడ్ పండితులు ఊహించారు.

కానీ అవతార్ 2 అయితే ఈ మార్క్ ని అందుకోలేదు కానీ ఇండియా బాక్సాఫీస్ దగ్గర 45 కోట్ల మేర ఓపెనింగ్స్ అన్ని భాషల్లో రాబట్టినట్టుగా ఇప్పుడు తెలుస్తుంది. దీనితో అయితే డెఫినెట్ గా ఇండియన్ సినిమా దగ్గర అవతార్ 2 గట్టి ఓపెనింగ్స్ నే రాబట్టింది అని చెప్పొచ్చు.

ఇప్పుడు టాక్ మరింత బలంగా మారింది. దీనితో డెఫినెట్ గా ఈ చిత్రం మరింత భారీ వసూళ్లు కొల్లగొట్టే ఛాన్స్ ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తాయి. ఈ సినిమా వసూళ్లు ఖచ్చితంగా ముందు హాలీవుడ్ రికార్డులు బ్రేక్ చెయ్యాలని కూడా చాలా మంది కోరుకుంటున్నారు.