వరల్డ్ సినిమా బాక్సాఫీస్ ని షేక్ చేసిన చిత్రాల్లో ఆల్మోస్ట్ టాప్ 5 లో మూడు చిత్రాలు వరల్డ్ నెంబర్ 1 దర్శకుడు జేమ్స్ కామెరాన్ తెరకెక్కించిన సినిమాలే ఉంటాయి. మరి వాటిలో ఆల్ టైం నెంబర్ 1 స్థానంలో అయితే అవతార్ 1 ఉండగా దీనికి సీక్వెల్ గా అయితే గత ఏడాది డిసెంబర్ లో వచ్చిన “అవతార్ ది వే ఆఫ్ వాటర్” కూడా ఒకటి.
మరి ఈ చిత్రం కూడా 2 బిలియన్ డాలర్స్ కి పైగా వసూళ్లు అందుకోగా వరల్డ్ వైడ్ థియేటర్స్ లో రన్ ని కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం అయితే ఫైనల్ గా ఇప్పుడు ఇండియన్ ఓటిటి లోకి వచ్చేసింది. కాగా గత కొన్నాళ్ల కితమే వరల్డ్ వైడ్ అయితే పలు స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ లలోకి వచ్చింది కానీ వరల్డ్ వైడ్ ఇంగ్లీష్ లో మాత్రమే వచ్చింది.
దీనితో ఇండియన్ ఫ్యాన్స్ డిజప్పాయింట్ కాగా ఇండియా లో అన్ని భాషల స్ట్రీమింగ్ కోసం ఎదురు చూసారు. ఇక దీనితో ఫైనల్ గా ఈరోజు జూన్ 7 నుంచి అయితే హాట్ స్టార్ లో సౌత్ అన్ని భాషలు సహా హిందీ మరియు ఇంగ్లీష్ లలో కూడా ఈ చిత్రం ఇపుడు ఓటిటి లోకి వచ్చేసింది.
దీనితో అయితే ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్న ఆ బిగ్ డే అయితే ఇపుడు ఇండియా ఆడియెన్స్ కి వచ్చేసింది అని చెప్పాలి. దీనితో అవతార్ 2 ట్యాగ్ కూడా ఇపుడు ఇండియా ట్రెండ్స్ లో నిలిచింది. ఇక ఈ చిత్రం ఒక్క ఇండియా లోనే కాకుండా వరల్డ్ వైడ్ గా కూడా అనేక దేశాల్లో పలు భాషల్లో ఈరోజే ఫ్రీ గా హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కి వచ్చింది.
Avatar: The Way of Water now streaming on Disney+ and Hotstar. pic.twitter.com/0jtlYlqlqz
— LetsCinema (@letscinema) June 7, 2023