ఓటిటిలో “అవతార్ 2” ఫిక్స్..సర్ప్రైజ్ లు ఇవే.!

గత ఏడాది చివరికి అసలు సిసలు బాక్సాఫీస్ బ్లాస్ట్ అన్నట్టుగా వచ్చిన భారీ చిత్రం “అవతార్ ది వే ఆఫ్ వాటర్”. వరల్డ్ వైడ్ గా ఆడియెన్స్ ఎంతో కాలం నుంచి వేచి చూసిన సినిమా ఇది. కాగా దర్శకుడు జేమ్స్ కామెరూన్ తెరకెక్కించిన ఈ మైండ్ బ్లోయింగ్ విజువల్ వండర్ వరల్డ్ వైడ్ గా టాప్ 3 గ్రాసర్స్ లో ఒకటిగా అయితే నిలిచింది.

మరి ఈ భారీ చిత్రం ఇప్పటికీ వరల్డ్ వైడ్ గా థియేటర్స్ లో రన్ అవుతూ ఉండడం విశేషం కాగా మరోపక్క ఈ సినిమా ఓటిటి రిలీజ్ కోసం చాలా మంది ఎదురు చూస్తున్నారు. అయితే ఈ రిలీజ్ పై  చిత్ర యూనిట్ వారు అధికారికంగా క్లారిటీ ఇచ్చారు. అయితే అయితే ఈ సినిమా ఈ మార్చ్ 28 నుంచి డిజిటల్ గా అందుబాటులో ఉండనుంది అని తెలిపారు.

అలాగే ఇక్కడే అసలు ట్విస్ట్ ఉన్నట్టుగా సినీ వర్గాలు చెప్తున్నాయి. ఈ సినిమా ఓటిటి లో సర్ప్రైజింగ్ గా ఎక్స్ట్రా గా 3 గంటల నిడివి తో అయితే రానున్నట్టుగా తెలుస్తుంది. మరి దీనికోసం గాను మేకర్స్ ఇందులో కూడా డబ్బులు ఛార్జ్ చేయనున్నట్టుగా ఇప్పుడు తెలుస్తుంది.

కాగా ప్రైమ్ వీడియో ఇతర కొన్ని ఓటిటి యాప్స్ లో సినిమాని ఇచ్చి అందులో మొదట రెంటల్ గా ఈ సినిమాని రిలీజ్ చేయనున్నారట. ఆ తర్వాత మళ్ళీ కొన్నాళ్ళకి ఒరిజినల్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ హాట్ స్టార్ లో గ్లోబల్ గా ఫ్రీ గా అయితే స్ట్రీమింగ్ కి ఈ సినిమా రానుంది అని సమాచారం. మొత్తానికి అయితే ఈ భారీ సినిమా పై ఇది ఓటిటి సమాచారం.