అవతార్ 2 : మొత్తానికి తెలుగు స్ట్రీమింగ్ ఎప్పుడు ఎందులో అంటే.!

గత ఏడాది వరల్డ్ సినిమాని అయితే షేక్ చేసి పారేసిన చిత్రాల్లో అవైటెడ్ భారీ చిత్రం “అవతార్ ది వే ఆఫ్ వాటర్” కూడా ఒకటి. సెన్సేషనల్ దర్శకుడు జేమ్స్ కేమరూన్ తెరకెక్కించిన ఈ మాసివ్ విజువల్ ట్రీట్ ని అయితే మేకర్స్ డిసెంబర్ లో రిలీజ్ చేయగా 2.2 బిలియన్ డాలర్స్ గ్రాస్ ని కొల్లగొట్టి హాలీవుడ్ ఆల్ టైం టాప్ గ్రాసర్స్ లో అయితే ఒకటిగా అయితే నిలిచింది.

కాగా ఈ చిత్రాన్ని అవతార్ 1 కి సీక్వెల్ గా తెరకెక్కించగా గత కొన్నాళ్ల కితం అయితే యూనివర్సల్ గా కేవలం ఇంగ్లీష్ స్ట్రీమింగ్ కి కి వచ్చింది. అయితే ఈ చిత్రం అప్పుడు కేవలం ఇంగ్లీష్ లోనే స్ట్రీమింగ్ గా రాగ మన దగ్గర రీజనల్ భాషల్లో స్ట్రీమింగ్ కోసం ఎదురు చూస్తున్న వారు ఎక్కువ అయ్యారు. 

ఇక అందులో మన తెలుగు ఆడియెన్స్ కూడా చాలా మంది ఉన్నారు. అయితే వారి అందరికీ గుడ్ న్యూస్ అయితే ఇప్పుడు తెలుస్తుంది. కాగా ఈ చిత్రం తెలుగు సహా ఇంగ్లీష్ మరియు ఇతర భారతీయ భాషల్లో ఈ జూన్ 7 నుంచి స్ట్రీమింగ్ కి రానుంది అట. కాగా ఈ చిత్రాన్ని ప్రముఖ స్టార్ వారు ఈ అన్ని భాషల్లో ఫ్రీ గా స్ట్రీమింగ్ కి తీసుకు రానున్నట్టుగా కూడా తెలుస్తుంది.

మొత్తానికి ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్న ఈ భారీ చిత్రం ఇపుడు ఫైనల్ గా రాబోతుంది అని చెప్పాలి. ఇక నెక్స్ట్ అయితే అవతార్ 3 సహా మరిన్ని సీక్వెల్స్ ని కామెరాన్ అందించే పనిలో ఇపుడు ఉన్నారు.