ప్రపంచ సినిమా దగ్గర బిగ్గెస్ట్ గ్రాసింగ్ ఫ్రాంచైజ్ లలో అయితే మాసివ్ విజువల్ వండర్ చిత్రం “అవతార్” కూడా ఒకటి. సీక్వెల్ తీసుకురావడానికే దర్శకుడు జేమ్స్ కామెరాన్ పదమూడేళ్ళ సమయం తీసుకున్నాడు. అయితే అప్పట్లోనే ఈ సినిమాని మొత్తం 5 భాగాలుగా తీసుకొస్తామని అలాగే పార్ట్ 2 హిట్ అయితేనే మిగతావి కూడా వస్తాయని అయితే కన్ఫర్మ్ చేశారు.
కాగా ఇపుడు పార్ట్ 2 కూడా హిట్ కావడంతో పార్ట్ 3 రిలీజ్ వెరీ మచ్ ఆన్ గా ఉందని కన్ఫర్మ్ చేశారు. అయితే ఇప్పుడు ఈ సిరీస్ మేజర్ స్టేక్ హోల్డర్ అయినటువంటి డిస్నీ సంస్థ అయితే ఈ భారీ చిత్రాల సీక్వెల్స్ ని వాయిదా వేసినట్టుగా బిగ్ న్యూస్ ఇప్పుడు ప్రపంచ సినీ వర్గాలు కన్ఫామ్ చేసాయి.
ఇక మొదటి డేట్స్ గా అయితే అవతార్ 3 డిసెంబర్ 20కి 2024లో ప్లాన్ చేయగా ఇది కాస్తా ఇప్పుడు 2025 డిసెంబర్ 19కి షిఫ్ట్ అయ్యింది. అలాగే అవతార్ 4 కి వస్తే 2026 డిసెంబర్ 18 కి ఫిక్స్ చేయగా ఇప్పుడు ఇది ఏకంగా 2029కి వెళ్ళిపోయింది. 2029 డిసెంబర్ 21 కి ఇప్పుడు లాక్ చేశారు.
ఇక ఫైనల్ గా ఈ ఫ్రాంచైజ్ లో చిట్ట చివరి చిత్రం అవతార్ 5 ని అయితే మొదటగా 2028 డిసెంబర్ 22 కి ఫిక్స్ చేయగా ఈ సినిమా ఇపుడు 2031 డిసెంబర్ 19కి మారిపోయింది. దీనితో ఈ భారీ చిత్రాలు ఊహించని విధంగా పెను మార్పులు తీసుకోవాల్సి వచ్చింది. ఇక ఈ ఇన్నేళ్ళలో ఎన్ని మార్పులు ఉంటాయో చూడాలి మరి.