ప్రతి రోజు వేలాది మంది రోడ్లపై ప్రయాణిస్తున్నారు.. కానీ అందరూ సురక్షితంగా ఇంటికి చేరుతారన్న నమ్మకం లేదు. మన దేశంలో ప్రతి సంవత్సం లక్షలాది మంది రోడ్డు ప్రమాదంలో మరణిస్తున్నారు. ప్రతి నాలుగు నిమిషాలకు దేశంలో ఒక యాక్సిడెంట్ జరుగుతోందని నివేదికలు చెబుతున్నాయి. రోడ్డు ప్రమాదాలు ఇప్పుడు ఒక నిత్య సంఘటనలా మారిపోయాయి. ట్రాఫిక్ నియమాలు పాటించినా.. జాగ్రత్తగా వాహనం నడిపినా ఒక చిన్న అసావధానం, మరొకరి తప్పిదం లేదా అదృష్టదౌర్భాగ్యం కూడా క్షణాల్లో జీవితాన్ని మార్చేయగలదు. ఈ ప్రమాదాల వెనుక ఉన్న కారణాలు కేవలం భౌతిక పరిమితుల్లోనే కాక, మానసిక స్థితి, శక్తుల అసమతుల్యత వంటి ఆధ్యాత్మిక కోణాల్లోనూ ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.
జ్యోతిష్కులు చెబుతున్న విషయాల ప్రకారం.. డ్రైవింగ్ ప్రారంభించే ముందు కేవలం ఐదు సెకన్ల పాటు మనస్సులో సానుకూల మంత్రాన్ని జపించడం వల్ల ప్రమాదాల నుంచి గట్టెక్కే అవకాశాలు పెరుగుతాయట. ఇది నమ్మకం మాత్రమే కాదు, శక్తి శాస్త్రంపై ఆధారపడిన సాధన అంటారు ఆయన. ఎందుకంటే ప్రతి ప్రయాణం ఓ కొత్త ప్రారంభం. ఆ ప్రారంభానికి శుభం కలుగాలంటే, దేవుని స్మరణ అవసరం.
ధర్మేంద్ర ప్రకారం, డ్రైవింగ్ చేసే ముందు ఈ మంత్రాలను మనస్సులో జపిస్తే మంచిదట. “ఓం శ్రీ గణేశాయ నమః” అనేది అడ్డంకులను తొలగించేందుకు ఉపకరిస్తుంది. “ఓం నమః శివాయ” మానసిక సమతుల్యతను ఇచ్చే శక్తిమంతమైన మంత్రం. హనుమంతుని ప్రార్థనైన “ఓం హరం హనుమతే నమః” ప్రయాణ భద్రతను బలపరుస్తుంది. అలాగే “ఓం అంతే రక్షాయ నమః” అనేది నేరుగా రక్షణకు సంబంధించిన మంత్రంగా, డ్రైవింగ్ సమయంలో ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది.
నిపుణులు సూచించిన కొన్ని చర్యలు కూడా ప్రయాణంలో సానుకూలతను తెస్తాయని చెబుతున్నారు. వాహనంలో చిన్న గణేశుడు లేదా హనుమంతుడి ఫోటో ఉంచడం, ఎరుపు లేదా పసుపు దుస్తులను వాహనంలో ఉంచడం వల్ల శక్తి కేంద్రాలు బలపడతాయని చెబుతున్నారు. అలాగే వాహనాన్ని ఎప్పుడూ కుడిచేతితో ప్రారంభించాలన్నది సంప్రదాయ జ్ఞానం. ఇక వాహనం డాష్‌బోర్డ్‌పై ముళ్ల మొక్కలు పెట్టకూడదని సూచన. ఇవి ప్రతికూల శక్తులను ఆకర్షించే అవకాశం ఉందట.
ఈ సాధారణమైన జ్యోతిష్య, వాస్తు సూచనలు ఆధ్యాత్మిక రక్షణ కల్పించడమే కాదు, మానసికంగా నమ్మకాన్ని పెంచుతూ, మనం మరింత జాగ్రత్తగా డ్రైవ్ చేయడానికి ప్రేరేపిస్తాయి. ప్రమాదాల నుంచి రక్షణకు ఇది ఒక ఆధ్యాత్మిక కవచంగా పని చేస్తుందనడంలో సందేహం లేదు. తదుపతి మీ ప్రమాణానికి ముందు ఒక్కసారి ఆ మంత్రాన్ని మనస్సులో జపించండి.. ప్రయాణం శుభంగా సాగుతుంది.