పునీత్ మరణం తర్వాత సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ ఎమోషనల్ అయినా అశ్విని..!

కన్నడ సినీ నటుడు పునీత్ రాజ్ కుమార్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈయన గత నెల 29వ తేదీన గుండెపోటుతో మరణించిన ఇప్పటికి ఈయన మరణ వార్తలు అభిమానులు అతని కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ క్రమంలోనే పునీత్ మరణం తర్వాత మొట్టమొదటిసారిగా అతని భార్య అశ్విని పునీత్ రాజ్ కుమార్ సోషల్ మీడియా వేదికగా తొలిసారిగా స్పందిస్తూ ఎంతో ఎమోషనల్ అయ్యారు.

ఈ క్రమంలోనే ఆమె ఇన్స్టాగ్రామ్ ద్వారా ఎమోషనల్ పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా అశ్విని మాట్లాడుతూ పునీత్ మరణం కేవలం కుటుంబ సభ్యులను మాత్రమే కాకుండా కన్నడ ప్రేక్షకులకు ఎంతో షాకింగ్ గా ఉంది. ఆయన మరణం తర్వాత అభిమానులు ఎలాంటి ఘర్షణలకు చోటివ్వకుండా అతనికి అంతిమ వీడ్కోలు పలికారు. ఇక పునీత్ పట్ల ఎంతో అభిమానంతో చూపిస్తూ ఆయన సమాధిని దర్శించడానికి రోజు పెద్ద సంఖ్యలో అభిమానులు వస్తుండడం విశేషం.

అలాగే ఆయనని అనుసరిస్తూ ఎంతోమంది అభిమానులు నేత్ర దానానికి ముందుకు రావడం పట్ల ఆయన పై ఎలాంటి అభిమానం ఉందో అర్థమవుతుంది. పునీత్ రాజ్ కుమార్ పై ఉన్న అభిమానంతో చాలామంది చేస్తున్నటువంటి సామాజిక సేవా కార్యక్రమాల ద్వారా ఆయన ఎప్పుడు జీవించే ఉంటారని పునీత్ భార్య అశ్విని మొట్టమొదటిసారిగా సోషల్ మీడియా ద్వారా ఎమోషనల్ పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.