Mokshagnya: రెడీ ఫర్‌ యాక్షన్‌.. మోక్షజ్ఞ నయా లుక్‌!

Mokshagnya: టాలీవుడ్‌ డైరెక్టర్‌ ప్రశాంత్‌ వర్మ నందమూరి బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞను గ్రాండ్‌గా లాంచ్‌ చేస్తున్నాడని తెలిసిందే. ఇప్పటికే మోక్షజ్ఞ జీన్స్‌ అండ్‌ బ్లాక్‌ హుడీ వేసుకొని సూపర్‌ చామింగ్‌ లుక్‌లో నడుచుకుంటూ వెళ్తున్న ప్రీ లుక్‌ షేర్‌ చేయగా.. మోక్షజ్ఞను ప్రశాంత్‌ వర్మ ఎలా చూపించబోతున్నాడో హింట్‌ ఇచ్చేస్తూ.. రిలీజ్‌ చేసిన స్టైలిష్‌ లుక్‌ నెట్టింట వైరల్‌ అవుతోంది. చాలా రోజుల తర్వాత మరో క్రేజీ లుక్‌ను షేర్‌ చేశారు మేకర్స్‌.

థిక్‌ హెయిర్‌ గెటప్‌లో మ్యాచింగ్‌ మీసం, గడ్డంతో సూపర్‌ కూల్‌గా కనిపిస్తూ యాక్షన్‌కు రెడీ అంటూ చెప్పకనే చెబుతున్నాడు మోక్షజ్ఞ. ఈ స్టిల్‌ నెట్టింట హల్‌ చల్‌ చేస్తూ అభిమానులు, నందమూరి ఫాలోవర్లలో సూపర్‌ హైప్‌ క్రియేట్‌ చేస్తుంది. ప్రశాంత్‌ వర్మ సినిమాటిక్‌ యూనివర్స్‌లో రాబోతున్న ఈ సినిమాలో.. డైరెక్టర్‌ ఇంతకీ మోక్షజ్ఞ కోసం ఎలాంటి సీన్లు రెడీ చేశాడు.. సిల్వర్‌ స్క్రీన్‌పై ఈ అప్‌కమింగ్‌ యాక్టర్‌తో ఎలాంటి మ్యాజిక్‌ చేయబోతున్నాడోనంటూ ఆసక్తిగా చర్చించుకుంటున్నారు సినీ జనాలు.

మైథలాజికల్‌ కాన్సెప్ట్‌తో సినిమా రాబోతుందని వార్తలు వస్తుండగా.. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ పనులు చివరి దశలో ఉన్నట్టు సమాచారం. ఈ సినిమాకు సంబంధించి మరిన్ని వివరాలపై మేకర్స్‌ త్వరలోనే క్లారిటీ ఇవ్వబోతున్నారట.

పుష్ప లీక్ || Analyst Dasari Vignan EXPOSED Who is Behind Pushpa 2 Movie Leak || Pawan Kalyan || TR