Allu Arjun: అల్లు అర్జున్ ను ఐకాన్ స్టార్ అనడానికి ఇదే నిదర్శనం…ప్రాణం పోశారు: ప్రశాంత్ వర్మ

Allu Arjun: అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సినిమాపై ఎంతోమంది సినీ సెలబ్రిటీలు స్పందిస్తూ ప్రశంసల వర్షం కురిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా ఈ సినిమాపై డైరెక్టర్ ప్రశాంత్ వర్మ స్పందిస్తూ అల్లు అర్జున్ నటన గురించి రష్మిక నటనపై ప్రశంశల వర్షం కురిపించారు. ఈ సందర్భంగా ప్రశాంత్ వర్మ మాట్లాడుతూ..పుష్పరాజ్‌ పాత్రలో అల్లు అర్జున్‌ యాక్టింగ్‌ అద్భుతంగా ఉందని అన్నారు.

పుష్పరాజ్ పాత్రలో అల్లు అర్జున్ స్క్రీన్ పై వైల్డ్ ఫైర్ చూపించారని తెలిపారు ప్రతి ఒక్క సన్నివేషంలోను ప్రతి ఒక్క డైలాగ్ అన్నిరకాల ఎమోషన్స్‌ను ఆయన అద్భుతంగా ప్రదర్శించారు. ఆయన్ని ఐకాన్‌ స్టార్‌ అనడానికి ఇదే నిదర్శనం. తన నటనతో శ్రీవల్లి పాత్రకు రష్మిక ప్రాణం పోశారు. దేవిశ్రీప్రసాద్‌ మ్యూజిక్ ఎంతో అద్భుతంగా ఉంది ఈ సినిమాలో భాగమైన ప్రతి ఒక్క నటీనటులకు నా అభినందనలు అంటూ ఈయన అభినందనలు తెలియజేశారు. ఇలాంటి మాస్‌, ఐకానిక్‌ పాత్రను చిత్రీకరించిన దర్శకుడు సుకుమార్‌, దీనిని నిర్మించి భారీస్థాయిలో విడుదల చేసిన మైత్రీ మూవీ మేకర్స్‌కు ప్రత్యేక అభినందనలనీ తెలిపారు.

సుకుమార్ అల్లు అర్జున్ కాంబినేషన్లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ వారు భారీ బడ్జెట్ చిత్రంగా పెరికెక్కించారు ఇక ఈ సినిమా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఇక ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చి అద్భుతమైన బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది.