నందమూరి నటసింహం బాలకృష్ణ వారసుడిగా మోక్షజ్ఞ ఎప్పుడు తెరపై కనిపిస్తాడో అని ఎదురుచూస్తున్నారు నందమూరి ఫ్యాన్స్. నిజానికి మోక్షజ్ఞ సినీ ఎంట్రీ ఎప్పుడో జరగవలసింది కానీ ఎందుకో అలా జరగలేదు. ఇప్పుడు అతని వయసు 30 సంవత్సరాలు ఈ వయసుకే అతని అన్న జూనియర్ ఎన్టీఆర్ స్టార్డం ని సంపాదించేసుకున్నాడు. కానీ మోక్షజ్ఞ మాత్రం మీన మేషాలు లెక్కబెడుతున్నాడు. అయితే అతనికి సినిమా ఇండస్ట్రీపై పెద్దగా ఇంట్రెస్ట్ లేదని వార్తలు వినిపిస్తున్నాయి.
కానీ నందమూరి అభిమానుల బలవంతం మీద బాలకృష్ణ అతడిని సినిమాలోకి తీసుకువచ్చే ప్రయత్నం చేశాడని సినీ వర్గాల భోగట్టా. ఆ క్రమంలోనే నందమూరి అభిమానులు ఎప్పటినుంచో వేచి చూస్తున్న తరుణం ఆసన్నమైందని అందరూ హ్యాపీగా ఉన్నారు. నందమూరి నట వారసుడు అరంగేట్రం డిసెంబర్ 5న గ్రాండ్ గా జరుగుతుందని, ఆ రోజే అతని మొదటి సినిమాకి సంబంధించిన పూజా కార్యక్రమాలతో మోక్షజ్ఞ మొదటి సినిమా పూజా కార్యక్రమాలు ప్రారంభం కావాల్సి ఉంది. కానీ ఎందుకో వాయిదా పడింది.
ఈ సినిమాకి హనుమాన్ సినిమాతో సూపర్ హిట్ కొట్టిన దర్శకుడు ప్రశాంత్ వర్మ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. సినిమాకి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా స్టార్ట్ చేశామని ప్రకటించారు. సినిమా ఫస్ట్ పోస్టర్ ని కూడా విడుదల చేశారు. అయితే ఈ మధ్యలోనే డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కి నందమూరి బాలకృష్ణ కి మధ్య వ్యవహారం చెడినట్లు సమాచారం. సినిమాకి కథ మాత్రమే తాను అందిస్తానని డైరెక్షన్ తన శిష్యుడు చేస్తాడని ప్రశాంత్ వర్మ చెప్పటంతో బాలకృష్ణ ఆలోచనలో పడినట్లు తెలుస్తుంది.
అయితే సినిమా ఆగిపోయిందా లేదంటే పోస్ట్ పోన్ అయిందా అనే విషయంపై ఇంకా క్లారిటీ లేదు. అయితే మొన్న అన్ స్టాపబుల్ షో కి ప్రశాంత వర్మ ని గెస్ట్ గా ఆహ్వానిస్తే భారీ మొత్తంలో డిమాండ్ చేశాడట ప్రశాంత్ వర్మ. మోక్షజ్ఞ మూవీ మధ్యలో ఆగిపోవడం, ప్రశాంత్ వర్మ ఇలా డిమాండ్ చేయటం భరించలేని బాలయ్య అభిమానులు ప్రశాంత్ వర్మకి తల పొగరు పెరిగింది అంటున్నారు. దీనిపై ప్రశాంత్ వర్మ ఎలాంటి రియాక్షన్ ఇస్తాడో చూడాలి.
