ప్రముఖ నటుడు వేణు సినిమాలకు దూరం కావడానికి రీజన్ తెలిస్తే షాకవ్వాల్సిందే?

హీరోగా చేసింది తక్కువ సినిమాలే అయినా ఆ సినిమాలతో భారీ స్థాయిలో విజయాలను అందుకున్న ప్రముఖ నటులలో వేణు ఒకరనే సంగతి తెలిసిందే. కామెడీ సినిమాలు వేణుకు నటుడిగా మంచి పేరును తెచ్చిపెట్టాయి. హీరోగా అవకాశాలు తగ్గిన తర్వాత వేణు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కెరీర్ ను మొదలుపెట్టారు. దమ్ము సినిమాలో వేణు కీలక పాత్రలో నటించగా ఈ సినిమా కమర్షియల్ గా ఆశించిన స్థాయిలో సక్సెస్ ను సొంతం చేసుకోలేదు.

అయితే రామారావు ఆన్ డ్యూటీ సినిమాతో వేణు సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తున్నారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో వేణు మాట్లాడుతూ చాలా సంవత్సరాల తర్వాత సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తున్నానని రామారావు ఆన్ డ్యూటీ సినిమాలో సీఐ మురళి పాత్రలో నటించానని ఈ సినిమా ప్రేక్షకులను కచ్చితంగా ఆకట్టుకుంటుందని వేణు చెప్పుకొచ్చారు. రామారావు ఆన్ డ్యూటీ మంచి సినిమా అని ఈ సినిమాను థియేటర్లలో చూడాలని వేణు చెప్పుకొచ్చారు.

యాక్టింగ్ అనేది ఫస్ట్ లవ్ అని అనివార్య కారణాల వల్ల నేను సినిమాలకు దూరంగా ఉండాల్సి వచ్చిందని వేణు చెప్పుకొచ్చారు. మళ్లీ యాక్టింగ్ చేస్తుండటంతో చాలా సంతోషంగా ఉందని ఆయన తెలిపారు. రామారావు ఆన్ డ్యూటీ సినిమాతో పాటు పారాహుషార్ సినిమాలో నేను నటిస్తున్నానని వేణు తెలిపారు. దర్శకుడు శరత్ మాండవ ఎంతో కష్టపడి నన్ను ఒప్పించారని వేణు చెప్పుకొచ్చారు.

దర్శకుడు సీఐ మురళి పాత్రలో నేనే చేయాలని పట్టుబట్టడంతో ఈ సినిమా చేయడానికి అంగీకరించారని వేణు తెలిపారు. రవితేజ ఫ్యాన్స్ కు నచ్చేలా ఈ సినిమా ఉంటుందని వేణు చెప్పుకొచ్చారు. సినిమాలో కొన్ని లేయర్స్ బ్యూటిఫుల్ గా ఉన్నాయని ఆయన చెప్పుకొచ్చారు. గతంలో నేను ఇలాంటి పాత్రలు చేయలేదని నాకు పాత్ర సూట్ అయిందో లేదో ప్రేక్షకులే చూసి చెబుతారని ఆయన చెప్పుకొచ్చారు.