సాధరణంగా సెలబ్రిటీలు ఎప్పుడు ఖరీదైన వస్తువులను వాడుతూ ఉంటారు. వారు వాడే కార్లు, దుస్తుల దగ్గర నుండి చెప్పుల వరకు అన్ని ఖరీదైన వస్తువులు ఉపయోగిస్తారు. వారి స్టేటస్ కి ఏమాత్రం తగ్గకుండా లక్షల రూపాయలు ఖర్చు చేసి బ్రాండెడ్ వస్తువులు కొనుగోలు చేస్తుంటారు. సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ పూజ హెగ్డే కూడా హీరోయిన్ గా మారిన తర్వాత చాలా ఖరీదైన వస్తువులను కొనుగోలు చేస్తోంది. కోట్ల రూపాయలు విలువ చేసే కార్లలో తిరుగుతున్న పూజా హెగ్డే గతంలో చెప్పుల కోసం లక్షల రూపాయలు వెచ్చించింది.
ఇటీవల సంప్రదాయబద్ధంగా చీరకట్టులో కూడా మెరిసింది. అయితే ఆ అమ్మడు కట్టుకున్న చీర ఖరీదు 48000. గత ఏడాది లాక్మే ఫ్యాషన్ ఈవెంట్ కు హాజరైన పూజ ఆ ఈవెంట్ లో ధరించిన లెహంగా ఖరీదు దాదాపు రెండు లక్షల రూపాయలు. 75వ కేన్స్ ఫిలిం ఫెస్టివల్లో పూజ హెగ్డే ధరించిన చెప్పుల ఖరీదు దాదాపు 43000. ఇదిలా ఉండగా ఇటీవల పూజా హెగ్డే కి సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అందుకు కారణం ఆ ఫోటోలలో ఆమె పట్టుకున్న బ్యాగ్. ఆ హ్యాండ్ బ్యాగ్ తో పూజా చాలా స్టైలీష్ గా.. బ్యూటిఫుల్ గా కనిపిస్తోంది.
ఈ ఫోటోలలో పూజ పట్టుకున్న బ్యాగ్ డిఫరెంట్ గా ఉండటంతో నెటిజన్స్ ని బాగా ఆకట్టుకుంది. దీంతో నెటిజన్స్ ఆ బ్యాగ్ గురించి ఆరా తీయగా దాని ధర తెలిసి షాక్ అవుతున్నారు. ఇంతకీ ఆ ముద్దుగుమ్మ వద్ద బ్యాగ్ ఖరీదెంతో తెలుసా ? ఆ బ్రాండెడ్ బ్యాగ్ ధర లక్షన్నర పైనే ఉంటుందని తెలుస్తొంది. ఈ విషయం తెలిసి నెటిజన్లు నోరెళ్ళబెడుతున్నారు. అయిన సెలబ్రిటీలకు లక్ష రూపాయల కూడా 100 రూపాయలతో సమానం. ఎందుకంటే వారు కోట్లలో సంపాదిస్తారు కాబట్టి విచ్చలవిడిగా డబ్బు ఖర్చు చేస్తూ ఉంటారు.