గాడ్ ఫాదర్ కోసం మురళీ మోహన్ ని ఆ లుక్ కావాలని అడిగిన చిరంజీవి..!

అలనాటి ప్రముఖ నటుడు మురళీ మోహన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మొదట నాటకాలలో నటించిన మురళీ మోహన్ ఆ తర్వాత ఇండస్ట్రీలో అడుగుపెట్టి ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో..ప్రధాన పాత్రలలో నటించాడు. అయితే చాలాకాలంగా ఇండస్ట్రీలో అడపాదడపా కనిపిస్తున్న మురళీమోహన్ తాజాగా చిరంజీవి హీరోగా నటిస్తున్న గాడ్ ఫాదర్ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు. యుద్ధభూమి, త్రినేత్రుడు, గ్యాంగ్ లీడర్ వంటి సూపర్ హిట్ సినిమాలలో చిరంజీవితో కలిసి నటించిన మురళీమోహన్ దాదాపు 30 సంవత్సరాల తర్వాత మళ్లీ గాడ్ ఫాదర్ సినిమాలో చిరంజీవితో కలిసి నటిస్తున్నాడు.

మలయాళ సూపర్‌హిట్‌ చిత్రం ‘లూసీఫర్‌’కు రీమేక్‌గా మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కుతున్న గాడ్ ఫాదర్ సినిమాలో చిరంజీవి హీరోగా నటించగా.. నయనతార చిరంజీవికి చెల్లెలుగా నటిస్తోంది. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కూడా కీలక పాత్రలో కనిపించనున్నాడు.అలాగే అలనాటి ప్రముఖ నటుడు మురళీమోహన్ కూడా కీలక పాత్రలో కనిపించనున్నాడు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న మురళీమోహన్ ఎన్నో ఆసక్తికర విషయాలను వెల్లడిస్తూ గాడ్ ఫాదర్ సినిమా విశేషాలను కూడా పంచుకున్నారు. ఈ సినిమాలో మురళీమోహన్ లుక్ కోసం చిరంజీవి ఫోన్ చేసి మరి ఒక లుక్ కావాలని అడిగారట.

ఈ క్రమంలో చిరంజీవి మురళీమోహన్ కి ఫోన్ చేసి”’గాడ్‌ ఫాదర్‌’ అనే సినిమా తీస్తున్నాం. ఈ సినిమా దర్శకుడు మోహన్‌ రాజా మిమ్మల్ని చూడలేదు. ఈ క్రమంలో మురళీ మోహన్ తండ్రి చనిపోయినప్పుడు కొంతకాలం ఆయన తెల్ల జుట్టుతో ఉన్నారట. ఆ ఫొటోలు పంపమని చిరంజీవి అడిగారని మురళీ మోహన్ వెల్లడించాడు. మీ ఫొటోలు పంపిస్తారా?’ అని చిరంజీవి అడిగారు. అయితే చిరంజీవి అడిగిన ఫోటోలు పంపితే దర్శకుడు వాటిని చూసి ఈ సినిమా కోసం ఆయనకి అచ్చం ఇలాంటి గెటప్ కావాలన్నాడట. అలా చిరంజీవి సూచన మేరకు ఈ సినిమా కోసం తెల్ల జుట్టుతోపాటు మురళీ మోహన్ గెడ్డాన్ని కూడా పెంచినట్టు చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం గాడ్ ఫాదర్ సినిమాలో మురళీమోహన్ పాత్రకు సంబంధించిన చిత్రీకరణ పూర్తయింది అని ఆయన