సోషల్ మీడియాలో సురేఖా వాణి చేసే రచ్చ అంతా ఇంతా కాదు. కూతురు సుప్రితతో కలిసి సురేఖా వాణి చేసే హల్చల్ ఎప్పుడూ హాట్ టాపిక్ అవుతూనే ఉంటుంది. ఇద్దరూ తల్లీ కూతుళ్లలా కాకుండా ఫ్రెండ్స్‌లా ఉంటూ.. వెకేషన్స్‌కు వెళ్తుంటారు. పార్టీలకు, పబ్‌లకు వెళ్లినా కూడా కలిసే వెళ్తుంటారు. ఆ మధ్య ఈ తల్లీ కూతుళ్లు గోవాలో చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. బీచ్‌లో నడుస్తూ పొట్టి పొట్టి బట్టలు వేసుకుని చేతిలో మందు గ్లాసుతో హల్చల్ చేశారు.
ఈ ఇద్దరూ సోషల్ మీడియాను వాడటంలో సిద్దహస్తుల్లా కనిపిస్తుంటారు. ఎప్పుడూ వైరల్ అవుతూ అందరి నోళ్లలో నానుతూ ఉంటారు. వీకెండ్ వస్తే చాలు ఈ ఇద్దరి హంగామా మామూలుగా ఉండదు. వీకెండ్స్‌లో నైట్ పార్టీ, క్లబ్, పబ్‌లంటూ తిరిగేస్తుంటారు. అయితే తాజాగా సురేఖా వాణి తన కూతురులోని ఇంకో కోణాన్ని పరిచయం చేసింది. మామూలుగా ఎప్పుడూ ఇంటి పనులు చేయనట్టుగా కనిపించే తన కూతురు మొదటి సారిగా పని చేస్తోందని సురేఖా వాణి సంబరపడిపోయింది.
మా ఇంట్లో పనిమనిషి జ్యోతి ఊరికి వెళ్లడంతో రాలేదు.. అందుకే నా కూతురు పని చేస్తోంది.. ఇలా చూడటం మొదటి సారి అని సురేఖా వాణి ఆశ్చర్యపోతుంటే.. అలా ఏం కాదు.. తాను పని చేస్తాను అంటూ సుప్రిత చెప్పుకొచ్చింది. నీ గురించి జనాలకు కూడా తెలియాలి. ఇలాంటివి అద్భుతాలు.. ఆణిముత్యాలు వారికి కూడా తెలియాలి కదా అందుకే వీడియో తీస్తున్నా అంటూ చెప్పుకొచ్చింది. మొత్తానికి సుప్రిత ఇళ్లు తుడిచే వీడియో బాగానే వైరల్ అవుతోంది.