అర్దరాత్రి దాక నైట్ క్లబ్‌లో రచ్చ.. వీకెండ్‌లో సురేఖా వాణి హల్చల్

Artist Surekha vani Enjoys In Weekends

నటి సురేఖా వాణి సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటుందో అందరికీ తెలిసిందే. వీకెండ్ వస్తే చాలు పబ్, క్లబ్, పార్టీలంటూ హడావిడి చేస్తుంటుంది. తన కూతురిని తీసుకెళ్లి మరీ పార్టీలు చేసుకుంటూ ఉంటుంది. ఎప్పుడూ వెకేషన్స్ ఊర్లు పట్టుకుని తిరుగుతూ ఉంటుంది. ఒక వేళ హైద్రాబాద్‌లోనే ఉంటే మాత్రం ఇలా వీకెండ్‌లు వస్తే చాలు నైట్ పార్టీల్లో తెగ హడావిడి చేస్తుంటుంది.

Artist Surekha vani Enjoys In Weekends
Artist Surekha vani Enjoys In Weekends

సురేఖా వాణిని తెరమీద చూడటం కంటే సోషల్ మీడియాలో చూడటానికే ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఎందుకంటే సురేఖా వాణి తెరపై ఎప్పుడూ చీరకట్టులో సంప్రదాయ బద్దంగా కనిపిస్తూ కామెడీ లేదా ఎమోషన్ సీన్స్‌ను పండిస్తూ ఉంటుంది. కానీ సోషల్ మీడియాలో మాత్రం సురేఖా వాణి చేసే హల్చల్ అంతా ఇంతా కాదు. అందాల ఆరబోతలో పీక్స్‌కు చేరుకుంటుంది. కుర్ర హీరోయిన్లతో పోటీ పడే అందం అంటూ నెటిజన్లు కామెంట్ పెడుతుంటారు.

ప్రతీ వీకెండ్‌కు తన కూతురిని తీసుకెళ్లి పార్టీలు చేసుకుంటుంది సురేఖా వాణి. సుప్రిత, ఆమె ఫ్రెండ్స్, సురేఖా వాణి కలిసి పార్టీలంటూ అంతా తిరుగుతుంటారు. అర్దరాత్రి వరకు రచ్చ రచ్చ చేస్తుంటారు. ఇక ఈ వీకెండ్‌లోనూ అంతే బ్లాక్ 22 అనే నైట్ పార్టీ క్లబ్‌లో రచ్చ చేశారు. పార్టీ అంతా ముగిశాక అర్ధరాత్రి వేళ ఇంటికి తిరుగు పయనమైనట్టున్నారు. మొత్తానికి సురేఖా వాణి మాత్రం ఇలా సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.