అత‌నికి సీక్రెట్‌గా ప్ర‌పోజ్ చేసిన అరియానా..?

బిగ్‌బాస్ హౌస్‌లో ఫినాలే రేస్ అఖిల్ అండ్ సోహైల్ మ‌ధ్య‌ మూడో లెవ‌ల్ న‌డుస్తున్న సంగ‌తి తెలిసిందే. ఒక‌వైపు వారిద్ద‌రు అన్నీ ఆపుకుని ఉయ్యాల దిగ‌కుండా నువ్వా నేనా అన్న‌ట్టు పోటీ ప‌డుతుంటే.. మిగ‌తావారు మాత్రం ఎంట‌ర్‌టైనింగ్ చేస్తూ ఛిల్ మోడ్‌లో క‌నిపించారు. ముఖ్యంగా హౌస్‌లో జోక‌ర్ అవినాష్‌ని ఆట‌ప‌ట్టిస్తూ ఓ రేంజ్‌లో ఆడుకున్నారు. అరియానా అయితే అవినాష్‌కు పెద్ద షాకే ఇచ్చింది.

 Ariyana secretly proposed in Bigboss house
Ariyana – Bigboss

అస‌లు మ్యాట‌ర్ ఫినాలే రేస్ టాస్క్ లెవ‌ల్ వ‌న్‌లోనే అరియానా చేతులెత్తేసిన సంగ‌తి తెలిసిందే. అక్క‌డ అఖిల్ అండ్ సొహైల్‌లు క‌లిసి ఆడుతూ మిగ‌తావారికి అంత‌గా పాలు ప‌ట్టుకునే చాన్స్ ఇవ్వ‌క‌పోవ‌డంతో డిస్ట‌ర్బ్ అయిన అరియానా రెండో లెవ‌ల్‌కు వెళ్ళ‌లేక‌పోవ‌డంతో బోరున ఏడుస్తూ ఆవేద‌న వ్య‌క్తం చేసింది. అంతే కాదు అమ్మాయిలు ఉండ‌గా ఇటాంటి టాస్కులు ఇచ్చినందుకు బిగ్‌బాస్ పై ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యింది.

అఖిల్ అండ్ సొహైల్‌లు క‌లిసి ఆడినా బిగ్‌బాస్ ఎలాంటి హెచ్చ‌రిక‌లు జారీ చేయ‌లేద‌ని, రెండో రౌండ్‌లో మాత్రం వ్య‌క్తిగ‌త ఆట అని హెచ్చ‌రించ‌డంతో అరియానా ఆగ్ర‌హం క‌ట్ట‌లు తెంచుకుంది. ఎందుకంటే తొలిరౌండ్‌లో వ్య‌క్తిగ‌తంగా ఆడిన అరియానా బోల్తా ప‌డిన సంగ‌తి తెలిసిందే. దీంతో త‌న‌ని ఇప్ప‌టికిప్పుడు బ‌య‌ట‌కు పంపించేసినా ప‌ర్వాలేద‌ని చెప్పిన బోల్డ్ బ్యూటీ.. బిగ్‌బాస్‌ను ఓ రేంజ్‌లో వేసుకుంది.

అయితే ఆ త‌ర్వాత బిగ్‌బాస్ ప్లాన్ చూసి యూట‌ర్న్ తీసుకుంది. మూడో లెవ‌ల్‌లో భాంగంగా టాస్క్ ఎంతో ట‌ఫ్‌గా జ‌రుగుతున్న విధాంనం చూసి, బిగ్‌బాస్ పై త‌న అభిప్రాయాన్ని మార్చుకున్న‌ అరియానా.. క్ష‌మించండి బిగ్‌బాస్ మిమ్మల్ని అర్ధం చేసుకోకుండా అనవసరంగా తిట్టుకున్నాను.. నిజానికి మీరంటే నాకు చాలా ఇష్టం.. మీరెవరికీ అన్యాయం చేయరంటూ కెమెరా వైపు చూస్తూ బిగ్‌బాస్‌కు ముద్దులివ్వ‌డ‌మే కాకుండా ఏకంగా బిగ్‌బాస్ ఐల‌వ్‌యూ చెప్పేసింది. దీంతో అప్ప‌టికే అరియాన- అవినాష్‌ల మ‌ధ్య ట్రాక్ న‌డుస్తుంద‌న్న టాక్ ఉన్న నేప‌ధ్యంలో అవినాష్‌కు షాకే అంటూ సోష‌ల్ మీడియాలో స‌ర‌దాగా కామెంట్స్ చేస్తున్నారు.