దుమ్ము రేగగొడుతున్న అరియానా ? ఆ టాస్క్ లోను ఆమనే విన్నర్ ?

ariyana performing so well in the bigg boss house

బిగ్ బాస్ సీజన్ 4 చివరి దశకి చేరేకొద్దీ ప్రేక్షకుల్లో ఉత్కంఠ పెరిగిపోతుంది.బిగ్ బాస్ హౌస్ సభ్యులు కూడా వారి సత్తా అంతా బయటకి తీసి టాస్క్ లలో గెలవటానికి ప్రయత్నిస్తున్నారు.ఈ వారం బిగ్ బాస్ ఇచ్చిన రాజు రాణి టాస్క్ లో గెలిచిన వారికి గోల్డ్ మైక్ తో ఆడియెన్స్ ను ఓట్స్ రిక్వెస్ట్ చేసే ఛాన్స్ ఇచ్చాడు. అయితే ఆ టాస్క్ లో హౌజ్ మేట్స్ ఎక్కువ సపోర్ట్ ఇవ్వడంతో అరియానా గోల్డ్ మైక్ అందుకుని ఆడియెన్స్ ను రిక్వెస్ట్ చేసింది. ఇక బుధవారం ఎపిసోడ్ లో సోహెల్, అరియానా గైట్ తెలిసిందే. ఓపికగా ఉండే టాస్క్ లో సోహెల్ విన్ అవగా అరియానా మీద ఎటాక్ చేశాడు సోహెల్.

ariyana

ఇక గురువారం ఏకాగ్రత టాస్క్ లో మరోసారి అరియానా విన్ అయ్యింది. హౌజ్ లో ఉన్న అందరి కన్నా ఆమె ఎక్కువ కాన్సెంట్రేషన్ తో ఈ టాస్క్ విన్ అయ్యింది. ఫైనల్ గా అరియానాకు మరోసారి ఆడియెన్స్ ను రిక్వెస్ట్ చేసే ఛాన్స్ వచ్చింది. అయితే రెండోసారి కొద్దిగా జోష్ ఫుల్ గా టాస్క్ గెలిచిన ఆనందంలో ఆడియెన్స్ ను రిక్వెస్ట్ చేసింది అరియానా.

ఫైనల్ గా ఈ వారం నామినేషన్స్ లో ఉన్న అరియానా ఈ మూడు రోజుల ఎపిసోడ్ లో గ్రాఫ్ బాగా పెరిగింది. ఆమె బదులుగా మోనాల్, హారిక డేంజర్ జోన్ లో ఉన్నారు. మోనాల్ కు అఖిల్ ఫ్యాన్స్ సపోర్ట్ చేస్తే మాత్రం హారిక ఈ వారం హౌజ్ నుండి ఎలిమినేట్ అవుతుందని అంటున్నారు. మరి ఈ వారం హౌజ్ నుండి ఎవరు బయటకు వస్తారో చూడాలి.