బిగ్ బాస్ సీజన్ 4 తో ఒక్కసారిగా లైమ్ లైట్ లోకి వచ్చేసింది యాంకర్ అరియానా గ్లోరి. ఆమె బిగ్ బాస్ వరకు వచ్చింది అంటే ఆ క్రెడిట్ అంతా కూడా మన రామ్ గోపాల్ వర్మ గారికే దక్కుతుంది. ఒక ఇంటర్వ్యూలో ఆమె అందాన్ని పొగుడుతూ ఆకాశానికి ఎత్తేసిన వర్మ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యేలా చేశాడు.
వర్మ ద్వారా వచ్చిన క్రేజ్ ను అరియానా బిగ్ బాస్ తో మరో రేంజ్ కు తీసుకెళ్లింది. టాప్ 5 కంటెస్టెంట్ లలో నిలిచి డేరింగ్ గర్ల్ అనిపించుకున్న ఆమె బిగ్ బాస్ హౌజ్ నుంచి బయటకు వచ్చిన తరువాత కూడా అదే తరహాలో తన యాటిట్యూడ్ తో జనాలను ఎట్రాక్ట్ చేస్తోంది. బిగ్ బాస్ కంటే గొప్ప విషయం తన జీవితంలో మరొకటి లేదని అంటూ సినిమా హీరోయిన్ గా అవకాశం వస్తే తప్పకుండా నటిస్తానని చెప్పింది.
ఆర్జీవి ఒకసారి కలవమని చెప్పినట్లు ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చిన అరియానా ఆయన అవకాశం వస్తే తప్పకుండా నటిస్తానని చెప్పింది. కానీ ముందు పాత్ర తనకు నచ్చలని చెబుతూ ఏది పడితే అది చేయనని చెప్పేసింది. తన కెరీర్ కు ఉపయోగపడే విధంగా నిర్ణయాలు తీసుకుంటానని అంటూ వచ్చే ఏడాది లేకుంటే ఏడాదిన్నర తరువాత పెళ్లి కూడా చేసుకుంటానని ఈ బోల్డ్ గర్ల్ కుండ బద్దలు కొట్టేసింది. ఇక అవినాష్ తనకు కేవలం ఫ్రెండ్ మాత్రమే అంటూ వచ్చే వాడు చాలా సైలెంట్ గా ఉండాలని వివరణ ఇచ్చింది.