బాలయ్య తన నట జీవితం మొత్తంలో లిప్ లాక్ ఇచ్చిన హీరోయిన్లు ఆ ఇద్దరే..?

దివంగత నటుడు నందమూరి తారక రామారావు వారసుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన నందమూరి బాలకృష్ణ స్టార్ హీరోగా ఎదిగాడు. కొన్ని దశాబ్దాల కాలంగా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్న బాలకృష్ణ వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉంటున్నాడు. ఇటీవల అఖండ సినిమా ద్వారా భారీ విజయం సొంతం చేసుకున్న బాలకృష్ణ ప్రస్తుతం గోపీచంద్ మల్లినేని దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో బాలకృష్ణ కు జోడిగా అందాల నటి శృతిహాసన్ నటిస్తోంది.

ఇలా హీరోగా మాత్రమే కాకుండా బాలకృష్ణ పెద్ద కొంతకాలంగా హోస్ట్ గా వ్యవహరిస్తూ బుల్లితెర ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంటున్నాడు. ఆహా వేదికగా ప్రసారమవుతున్న అన్ స్టాపబుల్ టాక్ షో కి హోస్ట్ గా వ్యవహరిస్తున్నాడు. ఇదిలా ఉండగా సాధారణంగా సినిమాలలో హీరో హీరోయిన్ మద్య లిప్ లాక్ సన్నివేశాలు ఉంటాయి. ప్రస్తుతం ఉన్న హీరో హీరోయిన్లు ఇలా ముద్దులు పెట్టుకోవడానికి ఏమాత్రం ఆలోచించడం లేదు. అందువల్ల దర్శకులు కూడా ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడానికి హీరో హీరోయిన్ల మధ్య ఇలాంటి లిప్ లాక్ సన్నివేశాలు పెడుతున్నారు.

కానీ అప్పట్లో హీరోయిన్లు ఇలా లిప్ లాక్ సన్నివేశాలకు అంగీకరించేవారు కాదు. సందర్భం డిమాండ్ చేసినప్పుడు మాత్రమే ఇలాంటివి చేయడానికి అంగీకరించేవారు. ఇక నందమూరి బాలకృష్ణ తన 47 ఏళ్ల సినీ జీవితంలో కేవలం ఇద్దరు హీరోయిన్లకు మాత్రమే లిప్ లాక్ ఇచ్చినట్లు సమాచారం. తన తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ హీరోగా ఎదిగిన బాలకృష్ణ కూడా తండ్రిలాగే హీరోయిన్ లకు ఎంతో గౌరవం ఇస్తూ ఇలాంటి సన్నివేశాలను అంగీకరించేవాడు కాదు. కానీ కథ డిమాండ్ చేయటం వల్ల మొదటగా బాలకృష్ణ “రాము”అనే సినిమాలో ఒక పాట లో హీరోయిన్ రజినీకి లిప్ లాక్ ఇచ్చాడు. ఆ తర్వాత “శ్రీమన్నారాయణ” సినిమాలో హీరోయిన్ ఇషా చావ్లా కి లిప్ లాక్ ఇచ్చాడు.