ఆదిపురుష్ కి గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ సర్కార్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఆదిపురుష్ మూవీ జూన్ 16 ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. ఏకంగా ఐదు భాషలలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు. త్రీడీలో సిల్వర్ స్క్రీన్ పై ఆదిపురుష్ మూవీని చూడటానికి ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గత రెండు, మూడు నెలల్లో పాన్ ఇండియా మూవీ ఒక్కటి కూడా రాలేదు.

ఇక ఆదిపురుష్ చిత్రంపై డార్లింగ్ అభిమానులు చిత్ర యూనిట్ చాలా హోప్స్ పెట్టుకుంది. కచ్చితంగా మూవీ హిట్ అవుతుందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. ఇక అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే అధిపురుష్ మూవీ రికార్డులు సృష్టిస్తోంది. తెలంగాణలో ఇప్పటికే ఆదిపురుష్ సినిమాటికెట్ ధరలని 50 రూపాయిలు అదనంగా పెంచారు. మూడు రోజుల పాటు ఈ పెంచిన ధరలు అమల్లో ఉంటాయి.

ఇక ఏపీలో కూడా పాన్ ఇండియా మూవీ కావడంతో పాటు భారీ బడ్జెట్ తో తెరకెక్కిన పౌరాణిక చిత్రం అని ప్రభుత్వం 50 రూపాయిలు అదనంగా టికెట్ ధరలు పెంచుకునే అవకాశం కల్పించారు. ఈ నేపథ్యంలో ఏపీలో కూడా అడ్వాన్స్ బుకింగ్స్ లు స్టార్ట్ అయ్యాయి. సింగిల్ స్క్రీన్స్ లో టికెట్ ధరలు ప్రస్తుతం 115 వరకు ఉంటే అదనంగా ఇప్పుడు 50 రూపాయిలు వసూలు చేస్తారు.

మల్టీ ప్లెక్స్ లో 177పై 50 రూపాయిలు అదనం. ఇక త్రీడీ గ్లాస్ ల కోసం మరల సపరేట్ చార్జీలు కూడా వసూలు చేసుకునేవెసులుబాటు కల్పించారు. ఇక ఈ టికెట్ ధరల పెంపు 10 రోజుల వరకు అమలులో ఉంటాయని జీవో జారీ చేశారు. టికెట్ రెట్లు పెంపుతో ఇప్పుడు ఆదిపురుష్ బయ్యర్లు చాలా హ్యాపీగా ఉన్నారు. ధరలు ఎక్కువ అయిన కూడా సినిమా చూడటానికి ప్రేక్షకులు భారీగా తరలి వస్తారని అంచనా వేస్తున్నారు.

ఇక మూవీకి పాజిటివ్ టాక్ వస్తే వారం తర్వాత ఫ్యామిలీ ఆడియన్స్ తాకిడి కూడా ఉండొచ్చని భావిస్తున్నారు. మరి ఈ పెంచిన ధరల కారణంగా ఆదిపురుష్ చిత్రానికి ఎలాంటి లాభం వస్తుందనేది మొదటి రోజు కలెక్షన్స్ తోనే తెలిసిపోతుంది. ఇక ఈ సినిమా ఫస్ట్ డేనే వంద కోట్లకి పైగా ప్రపంచ వ్యాప్తంగా కలెక్ట్ చేస్తుందని అంచనా వేస్తున్నారు.