గుడ్ న్యూస్ చెప్పిన విరాట్‌.. పండంటి బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చిన అనుష్క‌

విరుష్క అభిమానుల‌కు గుడ్ న్యూస్. అనుష్క శ‌ర్మ పండంటి ఆడ‌పిల్ల‌కు జ‌న్మ‌నిచ్చింది. ఈ విష‌యాన్ని విరాట్ కోహ్లీ త‌న ట్విట్ట‌ర్ ద్వారా పేర్కొన్నారు. ఈరోజు మ‌ధ్యాహ్నాం మాకు అమ్మాయి పుట్టింద‌నే విష‌యం మీతో పంచుకోవ‌డం ఆనందంగా ఉంది. మీ ప్రేమ‌, అభిమానాలు, ఆశీర్వాదాల‌తో అనుష్క‌, పాప ఇద్ద‌రు ఆరోగ్యంగా ఉన్నారు. కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తున్నందుకు ఆనందంగా ఉంది. ఈ స‌మ‌యంలో మీరంతా మా ప్రైవ‌సీని మీరంతా గౌర‌విస్తార‌ని మేము ఆశిస్తున్నాం అంటూ కోహ్లీ పేర్కొన్నారు.

కొద్ది రోజుల క్రితం కోహ్లీ దంపతులు ఇద్ద‌రు 2021 జ‌న‌వ‌రిలో త‌మ ఇంటికి పండంటి బిడ్డ‌కు జ‌న్మ‌నివ్వ‌బోతున్న‌ట్టు అఫీషియ‌ల్‌గా ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. మేము త్వరలో ముగ్గురం కాబోతున్నాము అంటూ ఆగ‌స్ట్‌లో ట్వీట్ చేశారు.అనుష్క కోసం విరాట్ కోహ్లీ తొలి టెస్ట్ మ్యాచ్ త‌ర్వాత ఆస్ట్రేలియా నుండి ఇండియాకు వ‌చ్చారు. అప్ప‌టి నుండి త‌‌న భార్య బాగోగులు చూసుకుంటూ ఉన్నాడు. అయితే బేబి బంప్‌తో అనుష్క కొన్ని యాడ్స్ చేయ‌డంతో పాటు ఫొటో షూట్స్ కూడా చేసిన సంగ‌తి తెలిసిందే. ఇవి ఫుల్ వైర‌ల్ అయ్యాయి.

ఇటీవ‌ల వోగ్ మ్యాగ‌జైన్‌ క‌వ‌ర్ పేజ్ కోసం పొడవైన వైట్ కాలర్డ్ లూస్ ఓవర్ కోట్ ధ‌రించి ఫొటో షూట్ చేసింది అనుష్క . ఈ ఫొటోల‌ను త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన అనుష్క ఈ ఫోటో నా కోసం.. నా లైఫ్ కోసం.. ఎంతో సంతోషానిచ్చింది అంటూ క్యాప్ష‌న్ రాసింది. ఈ ఫొటోలు నెటిజ‌న్స్‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకున్నాయి.