విలన్‌గా మారుతున్న ప్రముఖ హీరో.!

ఓ ప్రముఖ హీరో విలన్‌గా మారుతున్నాడు.! విలన్‌గా నటించడం అతనికి కొత్త కాదు. హీరోగా పరిచయమై, విలన్ వేషాలు వేసి, ఆ తర్వాత మళ్ళీ హీరో అయిపోయాడు. హీరోగా స్టార్‌డమ్ వచ్చాక మళ్ళీ విలన్ పాత్రలపై ఫోకస్ పెట్టలేదు ఆ హీరో.

అయితే, ఈ మధ్యకాలంలో చేసిన ప్రతి ప్రాజెక్టూ డిజాస్టర్ రిజల్టునే ఇస్తుండడంతో, మళ్ళీ విలనీజంపై ఫోకస్ పెట్టాడట. ఆ మాటకొస్తే, ఇటీవలి కాలంలో సదరు హీరో చేసిన పలు సినిమాల్లో, నెగెటివ్ టచ్ వున్న హీరోయిజం చూపించాడండోయ్.

ఈ క్రమంలోనే ఓ యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ చెప్పిన కథతో ఇంప్రెస్ అయిన, సదరు హీరో, విలనిజం ప్రదర్శించడానికి సిద్ధమయ్యాడట. ఓ ప్రముఖ హీరో ఈ సినిమాలో అతనికి పోటీగా హీరోయిజం ప్రదర్శిస్తాడట.

హీరో పాత్ర కంటే విలన్ పాత్రకు ఎక్కువ స్కోప్ వుంటుందట ఆ సినిమాలో. విలనిజంపై ఆసక్తి చూపుతున్న ఆ హీరో, నిర్మాణంలోనూ భాగం పంచుకోవాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే, వచ్చే సంక్రాంతికి సినిమా లాంఛనంగా ప్రారంభమయ్యే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.

ఈలోగా ఈక్వేషన్స్ ఏమన్నా మారితే, కథ మారిపోతుందిగానీ, దర్శకుడైతే మారడనీ, నిర్మాణ సంస్థ కూడా మారకపోవచ్చనీ అంటున్నారు. పూర్తి వివరాలు వెల్లడి కావాల్సి వుంది.