“గేమ్ ఛేంజర్” క్లైమాక్స్ కి మరో క్రేజీ ప్లాన్ చేసిన శంకర్.?

గ్లోబల్ స్టార్ హీరో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బాలీవుడ్ సెన్సేషనల్ హాట్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న భారీ చిత్రం “గేమ్ ఛేంజర్” కోసం అందరికీ తెలిసిందే. కాగా ఈ సినిమాని పాన్ ఇండియా దర్శకుడు శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కిస్తున్న భారీ చిత్రం ఇది.

కాగా ఈ మాసివ్ ప్రాజెక్ట్ ని మేకర్స్ భారీ హంగులతో తెరకెక్కిస్తుండగా రీసెంట్ గా అయితే మేకర్స్ భారీ షెడ్యూల్ ని ప్లాన్ చేస్తున్నట్టుగా తెలిపారు. కాగా ఇది వరకే ఈ క్లైమాక్స్ ని భారీ యాక్షన్ తో గన్స్ అండ్ బ్లాస్ట్ లతో నింపేశారు అని వినిపించింది. ఇక ఇప్పుడు అయితే ఈ క్లైమాక్స్ లో రీసెంట్ గా కేవలం యాక్షన్ ఎపిసోడ్స్ కి ప్లాన్ చేస్తున్న మోకోబాట్ షాట్స్ అయితే ప్లాన్ చేస్తున్నారట.

ఇది వరకే బీస్ట్, విక్రమ్ ఇంటర్వెల్ బ్లాక్ లో అలాగే పుష్ప సినిమాలో కూడా ఈ టెక్నాలజీ ని వాడారు. అయితే ఇప్పుడు ఇదే కెమెరా తో ఐతే శంకర్ మాసివ్ యాక్షన్ సీక్వెన్స్ ని గేమ్ చేంజర్ లో రామ్ చరణ్ పై ప్లాన్ చేశారట. మరి ఈ సీన్ అయితే ఏ లెవల్లో ఉంటుందో చూడాలి. శంకర్ సినిమాల్లో క్లైమాక్స్ ల కోసం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

ఆ గ్రాండియర్ అంతా తన సినిమాల్లో వేరే లెవెల్లో ఉంటుంది. మరి దిల్ రాజు కూడా ఈ సినిమాని తన బ్యానర్ లో 50వ సినిమా కాబట్టి ఎక్కడా తగ్గకుండా ప్లాన్ చేస్తున్నారు. మరి ఈ సినిమా ఎలా ఉంటుందో తెలియాలి అంటే కొన్నాళ్ళు ఆగక తప్పదు. దాదాపు అయితే ఈ సినిమాని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్లాన్ చేస్తున్నారు.