ఇప్పుడు బాలీవుడ్ సినిమా ఎంతో కేజ్రీగా ఎదురు చూస్తున్న ఇంకో మోస్ట్ అవైటెడ్ సినిమానే “ఆనిమల్”. హీరో రణబీర్ కపూర్ హీరోగా నేషనల్ క్రష్ రష్మికా మందన్నా హీరోయిన్ గా దర్శకుడు సందీప్ రెడ్డి వంగ తెరకెక్కించిన ఎమోషన్ అండ్ ఏక్షన్ డ్రామాయే ఇది. మరి ట్రైలర్ తో ఒక్క సారిగా విపరీతమైన హైప్ ని తెచ్చకున్న ఈ సినిమా తెలుగులో కూడా గట్టి హైప్ లో ఉంది.
దీనితో రిలీజ్ కి సమయం దగ్గర పడుతూ ఉండగా ఈ సినిమా ప్రమోషన్స్ లో చిత్ర యూనిట్ పాన్ ఇండియా భాషల్లో బిజీగా ఉన్నారు. అయితే ఈ సినిమా బుకింగ్స్ కూడా ఇండియా వైడ్ గా పాన్ ఇండియా భాషల్లో స్టార్ట్ అవ్వగా ఈ బుకింగ్స్ పరంగా ఇపుడు ఓ క్రేజీ న్యూస్ తెలుస్తుంది. ఇండియాలో ఇప్పుడు ఆనిమల్ బుకింగ్స్ ఎలా ఉన్నాయంటే ప్రతీ గంటకీ యావరేజ్ 10 వేలకి పైగా టికెట్స్ ఆన్ లైన్ లో అమ్ముడు పోతున్నాయట.
దీనితో అసలు ఆనిమల్ పట్ల అంచనాలు బుకింగ్స్ ఏ లెవెల్లో నమోదు అవుతున్నాయో అర్ధం చేసుకోవచ్చు. మరి ఓపెనింగ్స్ మాత్రం ఏ లెవెల్లో ఉంటాయో కూడా చూడాలని చాలా మంది ఎదురు చూస్తున్నారు. ఆల్రెడీ ఏ సర్టిఫికెట్ తెచ్చుకున్న ఈ చిత్రం సందీప్ గత చిత్రం కబీర్ సింగ్ ని మించి వసూళ్లు కొల్లగొడుతుంది అని చాలా మంది అనుకుంటున్నారు. మరి చూడాలి ఏమవుతుంది అనేది.