డే 2 అడ్వాన్స్ బుకింగ్స్ లో “ఆనిమల్” రికార్డ్..!

చాలా రోజులు నుంచి మూవీ లవర్స్ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఓ పర్ఫెక్ట్ మాస్ ఎంటర్టైనర్ ఆకలిని లేటెస్ట్ గా వచ్చిన సాలిడ్ చిత్రం “ఆనిమల్” నెరవేర్చింది అని చెప్పాలి. టాలీవుడ్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగ బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ తో చేసిన ఈ సెన్సేషనల్ ప్రాజెక్ట్ ఉన్న హైప్ ని మ్యాచ్ చేస్తూ సాలిడ్ టాక్ ని తెచ్చుకుంది.

అయితే కొందరి నుంచి నెగటివ్ టాక్ కూడా వచ్చింది కానీ ఎక్కువ పాజిటివ్ టాక్ స్ప్రెడ్ కావడంతో ఇపుడు ఆనిమల్ కి బాక్సాఫీస్ దగ్గర ఎదురు లేకుండా పోయింది. కాగా ఈ సినిమా హిందీలో అయితే రికార్డు వసూళ్లు ఈ చిత్రం ఇప్పుడు నమోదు చేస్తుంది.

అయితే మొదటి రోజు కన్నా ఇప్పుడు ఈ సినిమా రెండో రోజు కూడా రికార్డు వసూళ్లు అందుకుంటున్నట్టుగా తెలుస్తుంది. డే 2 హిందీ సినిమాల్లో చూసినట్టు అయితే రీసెంట్ గానే కాకుండా ఇప్పటివరకు వచ్చిన బిగ్ హిట్స్ ని కూడా ఆనిమల్ ఇప్పుడు క్రాస్ చేసినట్టుగా తెలుస్తుంది.

డే 2 అడ్వాన్స్ బుకింగ్స్ లో ఇప్పటివరకు జవాన్ చిత్రం 22 కోట్లకి పైగా వసూళ్లు అందుకుంటే దీనిని ఏకంగా 7 కోట్ల మార్జిన్ తో ఆనిమల్ కొట్టి 29 కోట్ల గ్రాస్ అది కూడా జస్ట్ అడ్వాన్స్ బుకింగ్స్ లోనే అందుకున్నట్టుగా ట్రేడ్ పండితులు చెప్తున్నారు. దీని బట్టి ఆనిమల్ హవా బాక్సాఫీస్ దగ్గర ఆడియెన్స్ లోని ఎలా ఉందో తెలుస్తుంది. మరి డే 2 కూడా వరల్డ్ వైడ్ 100 కోట్ల మార్క్ ని ఈ సినిమా క్రాస్ చేస్తుందో లేదో చూడాలి.