యాంకర్ కి ముద్దు పెట్టిన అనిల్ రావిపూడి.. వీడియో వైరల్?

తెలుగు బుల్లితెర పై జబర్దస్త్ షోకి దీటుగా ఎన్నో రకాల కామెడీ షోలు ప్రసారమవ్వుతున్న విషయం తెలిసిందే. అయితే ఎన్ని రకాల కామెడీ షో లు వచ్చినప్పటికీ అవి అంతగా క్లిక్ అవ్వలేకపోతున్నాయి. కాగా ఈ మధ్యకాలంలో బులితెరపై కామెడీ షోల హవా పెరిగిన విషయం తెలిసిందే. ఇప్పటికే జీ తెలుగు స్టార్ మా వంటి షోలలో అనేక రకాల కామెడీ షోలు ప్రసారం అవుతున్న విషయం తెలిసిందే. ఇది ఇలా ఉంటే తాజాగా ఓటీటి సంస్థ ఆహా కామెడీ స్టాక్ ఎక్స్చేంజ్ పేరుతో ఒక కామెడీ షోని ప్రారంభించింది. ఈ షోకి టాలీవుడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి జడ్జిగా వ్యవహరించారు.

ఈ షో కి సంబంధించిన ప్రోమో విడుదల అయింది. ఈ ప్రోమోలో పటాస్ కమెడియన్స్ అలాగే జబర్దస్త్ కమెడియన్స్ కలిపి స్కిట్లు వేస్తూ ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించారు. ఇక ఈ షో కి సుడిగాలి సుధీర్, దీపిక పిల్లి ఇద్దరు హోస్టులుగా వ్యవహరిస్తున్నారు. తాజాగా విడుదల చేసిన ప్రోమోలో జడ్జ్ అనిల్ రావిపూడి యాంకర్ దీపికా పిల్లికి ముద్దు పెట్టడం హైలెట్ గా నిలిచింది. అయితే దీపిక కి అనిల్ రావిపూడి ఎందుకు ముద్దు పెట్టాడు అన్నది తెలియాలి అంటే పూర్తి ఎపిసోడ్ వచ్చేవరకు వేచి చూడాల్సిందే మరి.

తాగా ఈ ప్రోమోలో ముక్కు అవినాష్, సద్దాం లాంటి కమెడియన్ లు తమదైన పంచులతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు. అలాగే ప్రోమో మధ్యలో సుడిగాలి సుదీర్ అక్కడున్న కమెడియన్లు అందరితో కలిసి టీచర్ స్టూడెంట్ అనే స్కిట్ చేస్తూ ప్రేక్షకులను మరింత నవ్వించారు. ఇక అక్కడే కూర్చున్న ప్రేక్షకులు ఎప్పటికప్పుడు అక్కడ ఉన్న కమెడియన్లకు వారి మొబైల్ ఫోన్ లో ఓట్లు వేయడం మనం చూడవచ్చు. కాగా ఎందుకు సంబంధించిన ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Comedy Stock Exchange Episode 1 Promo | Anil Ravipudi, Sudigali Sudheer, Deepika Pilli | ahaVideoIN