డైరక్టర్, కమెడియన్ తో కలిసి వీకెండ్ పార్టీలో రచ్చ చేసిన వర్షిణి..!

పలు టీవి షోలకి యాంకర్ గా వ్యవహరించి బుల్లితెర యాంకర్ గా గుర్తింపు పొందిన వర్షిణి సౌందరాజన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. యూట్యూబ్ వీడియోస్ ద్వారా ఫేమస్ అయిన వర్షిని బుల్లితెర మీద యాంకర్ గా అవకాశాన్ని దక్కించుకుంది. ఢీ షోలో వర్షిని చేసిన సందడి ఇప్పటికీ ప్రేక్షకులకి గుర్తుంది. ఆ షో ద్వారా పాపులర్ అయిన వర్షిని బుల్లితెర మీద ప్రసారమైన పలు టీవీ షోలలో దర్శనమిస్తూ ఆటపాటలతో రచ్చ చేసింది. తర్వాత మా టీవీలో ప్రసారమవుతున్న కామెడీ స్టార్స్ షోకి సింగిల్ యాంకర్ గా కొంతకాలం వ్యవహరించింది.

అయితే ఆ సమయంలో వర్షినికి సినిమాలలో నటించే అవకాశం రావడంతో ఆ షో ని విడచి వెళ్ళిపోయింది. వర్షిణి సోషియల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ అందమైన ఫోటోలను షేర్ చేస్తూ నెటిజన్స్ ని బాగా ఆకర్షిస్తోంది. వర్షిణి నటించిన ” పెళ్లి గోల” అనే వెబ్ సిరిస్ కూడా మంచి హిట్ అయ్యింది. కామెడీ స్టార్స్ షో తర్వాత వర్షిని బుల్లి తెరకు దూరమైంది. ప్రస్తుతం వర్షిని సినిమాలతో బిజీగా గడుపుతోంది. సుశాంత్ హీరోగా నటించిన మళ్ళీ మొదలైంది సినిమాలో కీలక పాత్రలో నటించింది. కానీ ఆ సినిమా హిట్ అవ్వకపోవడం తో వర్షిని కి చెప్పుకోదగ్గ గుర్తింపు
లభించలేదు.

ఇక సమంత ప్రధాన పాత్రలో నటించిన శాకుంతలం సినిమాలో కూడా నటించింది. ఈ సినిమా ఇంకా రిలీజ్ అవ్వలేదు. ఇదిలా ఉండగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే వర్షిని ఇటీవల ఒక పోస్ట్ షేర్ చేసింది. ఈ పోస్టు ద్వారా వర్షిని వీకెండ్ పార్టీని బాగా ఎంజాయ్ చేసినట్లు కనిపిస్తోంది. ఈ వీకెండ్ లో వర్షిణి ఒక స్టార్ కామెడియన్ తో ఒక డైరెక్టర్ తో కలిసి రచ్చ చేసింది. ఈ పార్టీకి సంబందించిన ఫోటోలలో వారిద్దరూ కనిపించారు. పైగా వర్షిణి ఈ మధ్య వారితో ఎక్కువ కనిపిస్తోంది. వీరి కాంబినేషన్ లో ఏదైనా సినిమా రాబోతోందా? అందుకే వీరు తరచు మీట్ అవుతున్నారా? అంటూ అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.