మొదటిసారిగా అలాంటి పని.. యాంకర్ సుమ మామూల్ది కాదు!

Anchor Suma With KTR

సుమ మామూలుగా సినిమా తారలతో ముచ్చట్లు పెడుతుంది. తన సమయస్ఫూర్తితో అందరికీ ముచ్చట్లు పెడుతుంది. సుమ అంత మాటకారి సినీ సెలెబ్రిటీల్లో ఎవ్వరూ లేరు. ఎవ్వరైనా సుమ మాటల ధాటికి తలొంచాల్సిందే. అయితే సుమ మొదటిసారిగా ఓ కొత్త పనిని చేపట్టింది. ఓ రాజకీయ నాయకుడు అది కూడా యూత్ ఐకాన్ కేటీఆర్‌ను ఇంటర్వ్యూ చేసింది. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

Anchor Suma With KTR
Anchor Suma With KTR

ఈ ఇంటర్వ్యూకి సంబంధించి సుమ మాట్లాడుతూ.. కేటీఆర్‌తో మాట్లాడటం ఎంతో సంతోషంగా ఉంది.. నా షోలో ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉంటాను.. కానీ మీ నాయకత్వం, మీరు మాట్లాడుతూ ఉంటే ఎంతో వినాలనిపించింది..మీరుండే విధానం.. చెప్పే విధానం, కమిట్‌మెంట్.. అన్నీ కూడా సూపర్బ్ అంటూ ఓ ఫోటోను సుమ షేర్ చేసింది. ఇక మరో ఫోటోను షేర్ చేస్తూ ఈ ఇంటర్వ్యూలో ఏమేమీ మాట్లాడుకున్నారో వివరించింది. ప్రస్తుతం సుమ చేసిన ఈ ఇంటర్వ్యూకి సంబంధించిన ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి.

ప్రస్తుతం సుమ కేటీఆర్‌ను స్పెషల్ ఇంటర్వ్యూ చేసిందిది. కేటీఆర్‌ను ఇంటర్వ్యూ చేస్తున్న ఫోటోను సుమ షేర్ చేస్తూ.. ఈ ఇంటర్వ్యూ చేయడం ఎంతో సంతోషంగా ఉంది.. ఓ హైద్రాబాదీగా మన సిటీ గురించి తెలుసుకోవాల్సి ఎంతో ఉంది.. ఎల్లప్పుడూ అభివృద్ది చెందుతూ ఉండే ఈ సిటీలో అమలు పరిచే తదుపరి ప్రణాళికలు ఇలా ఎన్నెన్నో పంచుకున్నారు. మీ టీంకు మీకు కుదోస్ సర్ అంటూ సుమ కేటీఆర్‌ను పొగిడేసింది.