వామ్మో సుమ ఇంట్లో కూడా అంతేనా.. అలా చేయాలంటూ వీడియో

యాంకర్ సుమ ఈ మధ్య కోవిడ్ కారణంగా ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎవరైనా మాస్క్ లేకుండా కనిపిస్తే చాలు వాయించేస్తోంది. మాస్క్ పెట్టుకో అని బెదిరించేస్తోంది. ఈ మేరకు కొన్ని వీడియోలు కూడా బాగానే వైరల్ అయ్యాయి. తన మేకప్ రూంలో మేకప్ మ్యాన్‌ను, లిఫ్ట్‌లో ఓ అబ్బాయిని మాస్క్ పెట్టుకోకపోతే దడ దడలాడించింది. ఇవన్నీ కూడా కరోనా సోకకుండా తీసుకునే జాగ్రత్తలే.

Anchor Suma Steam Up Video Goes Viral,Anchor Suma, Steam
Anchor Suma Steam Up Video Goes Viral,Anchor Suma, Steam

మాస్క్ పెట్టుకోండి, భౌతిక దూరాన్ని పాటించాలని చెబుతున్నా ఎవ్వరూ కూడా పాటించడం లేదు. పైగా నిత్యం షూటింగ్‌లంటూ అక్కడికి ఇక్కడికి తిరిగే వాళ్లు ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి. అందుకే సుమ ప్రతిరోజూ తన ఇంట్లో ఆవిరి పట్టుకుంటుందట. దాదాపు తారలంతా ఇలాంటివే చేస్తున్నారు. ఎందుకంటే బయటకు వెళ్లొచ్చాక ఒక్కసారి ఆవిరి పట్టుకుంటే ఎలాంటి చింత ఉండదు. సురేఖా వాణి కూడా షూటింగ్ గ్యాప్‌లోనే ఆవిరి పట్టేసుకుంటోందట. ఈ మేరకు ఆమె వీడియోలు కూడా సోషల్ మీడియాలో పెట్టేది.

తాజాగా సుమ కూడా ఓ వీడియోను షేర్ చేసింది. ఇంట్లో ఆవిరి పట్టుకుంటున్న వీడియోను షేర్ చేస్తూ అందరూ ఇలాగే చేయండని సలహా ఇచ్చింది. సురక్షితంగా ఉండండి.. మీ ఆరోగ్యం, సంతోషం పట్ల బాధ్యతాయుతంగా మెలగండి.. అందరూ ఆవిరి పట్టుకోండి అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం సుమ షేర్ చేసిన ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది.