Anchor Suma: రాజీవ్ కనకాలతో పెళ్లి.. సుమకు ఎన్ని కండిషన్లు పెట్టారా?

Anchor Suma: టాలీవుడ్ ఇండస్ట్రీలో యాంకర్ అంటే టక్కున అందరికీ సుమా కనకాల పేరు గుర్తుకు వస్తుంది. గత రెండు దశాబ్దాలకు పైగా ఇండస్ట్రీలో యాంకర్ గా కొనసాగుతూ తన మాట తీరుతో అందరిని ఆకట్టుకుంటున్న సుమ ఇప్పటికీ కూడా ఏమాత్రం తీరిక లేకుండా వరుస కార్యక్రమాలు సినిమా ఈవెంట్లు ఇంటర్వ్యూలు అంటూ బిజీగా ఉన్నారు. ఇక సుమ ఒకవైపు కెరియర్ పరంగా ఎంతో మంచి సక్సెస్ అందుకుంటూనే మరోవైపు వ్యక్తిగత జీవితంలో కూడా ఎంతో సంతోషంగా గడుపుతున్నారు.

సుమా కనకాల నటుడు రాజీవ్ కనకాలను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. వీరి వివాహం 1999వ సంవత్సరంలో జరిగింది. ఇక సుమ రాజీవ్ కనకాలది ప్రేమ వివాహం అనే సంగతి తెలిసిందే 1994లో ఒక స్టూడియోలో వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడింది ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. అయితే సుమను పెళ్లి చేసుకోవాలి అంటే రాజీవ్ ఆమెకు ఒక కండిషన్ పెట్టారని గతంలో ఒక ఇంటర్వ్యూ సందర్భంగా సుమా స్వయంగా వెల్లడించారు.

సుమ యాంకర్ కంటే ముందు నటిగా పలు సినిమాలు సీరియల్స్ లో నటించిన విషయం తెలిసిందే. ఇక తనని పెళ్లి చేసుకోవాలి అంటే సినిమాలకు దూరంగా ఉండాలని రాజీవ్ కనకాల కండిషన్లు పెట్టినట్లు సుమ తెలిపారు. అయితే ఇది నచ్చని ఆమె తనతో మాట్లాడకుండా ఏకంగా వరుస సినిమాలకు కమిట్ అయ్యారట అయితే ఈమె నటించిన మూడు సినిమాలు కూడా డిజాస్టర్ కావడంతో సినిమాలపై ఆసక్తి తగ్గించి తిరిగి రాజీవ్ కనకాలతో మాట్లాడే ప్రయత్నం చేశారని అలా ఇద్దరు ఓ మంచి నిర్ణయానికి వచ్చి వివాహం చేసుకున్నారని తెలుస్తోంది..

పెళ్లి తర్వాత సుమ సినిమాలకు దూరంగా ఉన్న బుల్లితెర కార్యక్రమాలకు యాంకర్ గా వ్యవహరిస్తూ సందడి చేస్తున్నారు. ఇక ఇటీవల జయమ్మ పంచాయతీ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు అయితే ఈ సినిమా అనుకున్న స్థాయిలో పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయిందని చెప్పాలి.