Suma: నిత్యం ఎంతో చలాకీగా ఉండే సుమ ప్రతిరోజు ఆ విషయంలో అంత బాధపడుతుందా… ఏమైందంటే?

Suma: తెలుగు బుల్లితెర యాంకర్ గా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో సుమా కనకాల ఒకరు. ఈమె మలయాళీ అమ్మాయి అయినప్పటికీ తెలుగింటి కోడలుగా అడుగుపెట్టి ఎంతో స్పష్టంగా తెలుగు మాట్లాడుతూ యాంకర్ గా మంచి సక్సెస్ అందుకున్నారు. ఇక ఇండస్ట్రీలో ఈమెకు ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. యాంకర్ సుమ కోసమే కొంతమంది హీరోలు తమ సినిమా ఫంక్షన్లను కూడా వాయిదా వేసుకుంటారంటే సుమాక్రేజ్ ఏ స్థాయిలో ఉందో స్పష్టమవుతుంది.

ఎలాంటి ఫంక్షన్ అయినా ఏ మాత్రం తడబడకుండా గలగల మాట్లాడుతూ తన మాట తీరుతో ఆటపాటలతో ప్రేక్షకులు అందరిని మెప్పించే సుమ నిత్యం చలాకీగా కనిపిస్తూనే ఉంటారు. మరి కొద్ది రోజులలో ఐదు పదులలోకి అడుగుపెడుతున్న సుమ పాతికేళ్ల అమ్మాయి లాగే చలాకీగా ఉంటారు. నిత్యం ఈవెంట్లు కార్యక్రమాలు అంటూ ఎంతో బిజీగా, చలాకిగా గడుపుతూ ఉండే ఈమె ప్రతిరోజు ఓ విషయంలో ఎంతో బాధపడతారని తెలుస్తోంది.

మరి సుమ ప్రతిరోజు బాధపడే విషయం ఏంటంటే తన అత్తయ్య గురించి ఈమె ప్రతిరోజు బాధపడతారట. సుమ తన అత్తయ్య అంటే చాలా ఇష్టపడేవారు తన తల్లి తర్వాత తల్లిలాగా తన అత్తను చూసుకున్నారు అయితే గత కొద్ది సంవత్సరాల క్రితం తన అత్తయ్య మరణించడంతో తన అత్తయ్య లేని లోటు స్పష్టంగా కనిపిస్తుందని అందుకే ప్రతిరోజు తన అత్తను తలుచుకొని బాధపడతారు అంటూ స్వయంగా ఓ సమయంలో సుమా వెల్లడించారు.

తన అత్తయ్య ఉన్నప్పుడు సుమ తన విధులలో ఎంతో బిజీగా ఉండగా ఇంటి బాధ్యతలను పిల్లల బాధ్యతలను తన అత్తయ్య చాలా చక్కగా నిర్వర్తించేవారు. అయితే తన అత్తయ్య లేకపోవడంతో ఆమె లేని లోటు స్పష్టంగా కనిపిస్తుందని అందుకే ఇంటికి వెళ్లగానే తన అత్తయ్య ఫోటోని చూస్తూ ఎంతో బాధపడుతుంటారట.