ఏకంగా సుమ స్థానానికే ఎసరు పెట్టిందే.. రష్మీ కోరికలు మామూలుగా లేవు!!

బుల్లితెర యాంకరింగ్‌లో సుమను ఢీ కొట్టే వారెవ్వరూ లేరు. ఇకపై రారు. ఎందుకంటే అనసూయ, రష్మీ లాంటి అందగత్తెలు యాంకరింగ్‌లోకి ఫేమస్ అయినా సరే సుమకు ఉండే క్రేజ్ ఏ మాత్రం చెక్కు చెదరలేదు. మొదట్లో అనసూయను చూసి సుమ కాస్త భయపడిందట. అంతం అందంగా ఉంది ఏంటి అని మనసులోకూడా అనుకుందట. కానీ సుమ ప్రత్యేకత సుమదే. ఆమె మాట తీరు, వెంటనే సమయానికి తగ్గట్టు స్పందించే తీరు మరెవ్వరికీ రాదు.

తాజాగా ఎక్స్ ట్రా జబర్దస్త్ షోలో సుమ గెస్ట్‌గా వచ్చింది. అయితే సుమ జబర్దస్త్ స్టేజ్ మీదకు రాలేదు. కెవ్వు కార్తీక్ టీమే తమ స్కిట్స్‌లో భాగంగా స్టార్ మహిళలోకి వెళ్లారు. తన స్కిట్‌లో స్టార్ మహిళను, సుమను ఇన్వాల్వ్ చేయడంతో బాగానే కలిసొచ్చేలా ఉంది. అయితే కెవ్వు కార్తీక్, ఇమ్మాన్యుయేల్ స్టార్ మహిళకు వెళ్లారు వారి వెనకాలే రష్మీ కూడా వచ్చింది. ఆ డైలాగ్స్ స్కిట్స్‌లో భాగమే అయినా అవి మనసులోమాటను బయటపెట్టినట్టున్నాయి.

సుమ గారు అలా నిల్చొని నిల్చొని అలిసిపోరా.. అలా సోఫా వేసుకుని కూర్చోవచ్చు కదా అని ప్రేమ పొంగిపోతోన్నట్టు సుమపై రష్మీ కామెంట్ చేసింది. సుమ కూడా ఏమీ తక్కువ తినలేదు కదా. గ్యాప్ ఇస్తే మీరు వచ్చి నిల్చుందామనే కదా నాకు అర్థమైంది అని అనడంతో రష్మీ షాక్ అయింది. అలా మొత్తానికి స్టార్ మహిళను కూడా ఏలేద్దామని రష్మీ మనసులో ఉన్నట్టుందేమో. కానీ ఆ క కోరిక మాత్రం ఇప్పట్లో తీరదు.

Extra Jabardasth - 23rd October 2020 - Extra Jabardasth Latest Promo - Rashmi,Sudigali Sudheer