జరిగింది చాలా చిన్న విషయమేనా.? అంత చిన్న విషయమైతై, చాలా అనుభవం వున్న సీనియర్ యాంకర్ ఎందుకు నోరు జారినట్టు.? అసలు కథ వేరే వుంది.!
ఓ సినిమా ఫంక్షన్‌లో సీనియర్ యాంకర్ సుమ, కొందరు మీడియా ప్రతినిథుల్ని తిండిపోతులుగా అభివర్ణించిన సంగతి తెలిసిందే. మీడియా ప్రతినిథుల నిరసనతో, సుమ క్షమాపణ చెప్పడంతో అక్కడికి ఆ వివాదం సద్దుమణిగినట్లయ్యింది.
అసలేం జరిగింది.? అని ఆరా తీస్తే, ఈ మధ్యన సినిమా ఈవెంట్ అంటే.. తిండి ఖర్చు ఎక్కువైపోతోంది. ఎవరెవరో వస్తున్నారు.. అందినకాడికి మేసేస్తున్నారు. అదే సమస్య. టోకెన్లు ఇస్తున్నా, పరిస్థితి అదుపు తప్పుతోంది. చిత్ర యూనిట్‌కి సైతం తిండి దొరకని పరిస్థితి. అంతలా మీడియా ప్రతినిథులు కొందరు తినేస్తున్నారట.
ఈ విషయాన్నే సుమ పర్సనల్‌గా ఎందుకు తీసుకున్నారన్నది మరో సస్పెన్స్. సాధారణంగా సుమ ఇలాంటి వివాదాల జోలికి వెళ్ళరు. ఆమె స్పేస్ తీసుకోవడమంటే, తెరవెనుక బలమైన కారణం వుండే వుంటుంది.
ఈ విషయంలో సుమకి అండగా నిలబడిందెవరు.? అన్నది తేలాల్సి వుంది. అలా నిలబడ్డవాళ్ళే, కొందర్ని టార్గెట్ చేసేలా, ‘తిండిపోతు’ కామెంట్స్ సుమతో చేయించినట్లు తెలుస్తోంది. తిండి ఒక్కటే కాదు, పనికిమాలిన ప్రశ్నలూ ఇక్కడ చర్చనీయాంశమవుతున్నాయ్.
ఇలాంటోళ్ళకు తిండి ఎందుకు పెట్టాలి.? అన్న చర్చ నిర్మాతల్లో జరుగుతోందిట.!