బుల్లితెరపై యాంకర్ రవిది ప్రత్యేకమైన శైలి. బుల్లితెరపై మొదటి పులిహోర రాజాగా యాంకర్ రవిని చెప్పుకోవచ్చు. అతని పక్కన ఏ లేడీ యాంకర్ పని చేసినా ఏదో ఒక రూమర్ వస్తూనే ఉంటాయి. స్టార్ మా మ్యూజిక్‌లో సమ్‌థింగ్ స్పెషల్ అంటూ రవి, లాస్య ప్రోగ్రాం చేసినప్పటి నుంచి నేటి వరకు ఎవరో ఒక లేడీ యాంకర్ పక్కన ఉండాల్సిందే. కెమిస్ట్రీ కలపాల్సిందే షోను హిట్ చేయాల్సిందే.
అలా అక్కడి నుంచి ఈటీవీలో పటాస్ షోలో వచ్చి పడ్డాడు. లాస్య తరువాత రవి లైన్‌లోకి శ్రీముఖి వచ్చింది. ఇలా వీరిద్దరి జోడి విపరీతంగా పాపులర్ అయింది. దీంతో పాటే పటాస్ షో కూడా ఓరేంజ్‌లో వర్కౌట్ అయింది. శ్రీముఖి బిగ్‌బాస్‌లోకి వెళ్లడంతో ఆ ప్లేస్‌ను వర్షిణి భర్తీ చేసింది. మళ్లీ ఈమెతోనూ కెమిస్ట్రీ బాగానే కలిసింది. అలా ఈమె కూడా సైడ్ అయ్యాక మళ్లీ విష్ణు ప్రియ వచ్చింది.
ఆపై పటాస్ షోనే ఎత్తేశారు. దీంతో రవి జీ తెలుగులో అదిరింది షోలో ఎంట్రీ ఇచ్చాడు. అక్కడ భాను శ్రీతో బాగానే సెటిల్ అయ్యాడు. మళ్లీ ఈటీవీలో నువ్వు రెడీ నేను రెడీ అనే షోను వింద్యతో కలిసి చేస్తున్నాడు. ఇదంతా బాగానే ఉంది. అయితే తాజాగా రవి.. జబర్దస్త్‌లోని ఓ స్కిట్‌లో గెస్ట్ ఎంట్రీ ఇచ్చాడు. స్కిట్‌లో భాగంగా రవి పంతులు వేషం వేసినట్టున్నాడు. ఈ కుర్చీ మీదే పెళ్లి చేశాను.. మళ్లీ దినాలు చేశాను.. అటు తిరిగి ఇటు తిరిగా నా వద్దకే వచ్చింది అంటూ డైలాగ్ వదులుతాడు.
దీనికి అవతల ఉన్న ఆర్టిస్ట్.. నువ్ అటు తిరిగి ఇటు తిరిగి మళ్లీ ఇక్కడికే రావాల్సిందే అంటూ ఈటీవీని, మల్లెమాలను వదలి జీ తెలుగుకు వెళ్లడం, అదిరింది షో చేయడంపై సెటైర్ వేశాడు. ఇలా గెస్ట్‌గా వెళ్లడం ఎందుకు ఇలా పంచ్‌లు, సెటైర్లు వేయించుకుని పరువుతీయించుకోవడం ఎందుకు . మొత్తానికి రవి మాత్రం జబర్దస్త్ వేదికపై బాగానే పంచులు వేస్తున్నాడు.