బుల్లితెరపై రష్మీ-సుధీర్‌ది తిరుగులేని జంట. ఈ ఇద్దరికి ఇప్పటికే స్పెషల్ ఈవెంట్లలో పెళ్లి కూడా చేసేశారు. నిజంగా ఒక వేళ ఇద్దరూ పెళ్లి చేసుకున్నా అంత గొప్పగా జరగదేమో అన్నంత గ్రాండ్‌గా చేశారు. అది స్పెషల్ ఈవెంట్‌లో ఎంటర్టైన్మెంట్‌లో భాగమే అయినా కూడా ప్రేక్షకులను మాత్రం వేరే లోకంలోకి తీసుకెళ్లింది. ఇక తాజాగా రష్మీ పెళ్లిపై వార్తలు ఊపందుకున్నాయి. ఓ బిజినెస్‌మెన్‌ను పెళ్లి చేసుకోబోతోందని రూమర్లు వస్తున్నాయి.
అయితే తాజాగా రష్మీ పెళ్లిపై యాంకర్ రవి పరోక్షంగా కామెంట్స్ చేశాడు. తాజాగా రవి జబర్దస్త్‌లో అతిథి పాత్రలో మెరిశాడు. రాకింగ్ రాకేష్ స్కిట్‌లో భాగంగా దువ్వాడ జగన్నాథమ్ లాంటి పాత్రలో దువ్వాడ రవి అంటూ గెటప్ వేశాడు. స్కిట్‌లో భాగంగా రష్మీ దగ్గరకు వెళ్లి ‘ఏవమ్మా అరవై ఏళ్లు వచ్చాక పెళ్లి చేసుకుంటావా. షష్ఠి పూర్తి సమయంలో శుభకార్యమంటే బాగోదు. ఏంటి ప్రాబ్లం వాడు ఒప్పుకోవడం లేదా. కాదు కాదు నువ్వే ఒప్పుకోవట్లేదంట కదా. ఒప్పేసుకోరాదు ఆ శుభకార్యమేదో నేనే జరిపిస్తా’ అంటూ సెటైర్ వేశాడు.
ఇక అలా యాంకర్ రవి అనడంతో రష్మీ మొహంలో మార్పులు వచ్చేశాయి. దీంతో తెగ సిగ్గు పడిపోయింది. సిగ్గు పడుతున్నావంటే శుభాకార్యం చాలా దగ్గరలోనే ఉంది అంటూ రవి మరో కౌంటర్ వేశాడు. అయితే రవి ఈ మాటలు స్కిట్‌లో భాగంగానే అన్నా కూడా అందులో వాస్తవం ఉందని అందరికీ అర్థమైంది. శుభకార్యం దగ్గర్లోనే ఉందని మాట మాత్రం స్కిట్‌లో రాసిన డైలాగ్‌లా లేదు. ఎలాగూ ఫిక్స్ అయింది కదా అని రాసినట్టు కనిపిస్తోంది. ఏది ఏమైనా రష్మి పెళ్లి వార్తలు మాత్రం దుమ్ములేచిపోతున్నాయి.