యాంకర్ రష్మీ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటుంది.. మూగ జీవాలకు సాయంగా ఉండేందుకు ఎంతలా పాటు పడుతుందన్న విషయాలు అందరికీ తెలిసిందే. మూగ జీవాలు, పశువులు, పక్షులు, జంతువులు ఇలా ప్రతీ ఒక్క వాటిపై రష్మీ స్పందిస్తూ ఉంటుంది. అలా రష్మీపై కొన్ని సార్లు నెగటివ్ కామెంట్లు.. ఇంకొన్ని సార్లు పాజిటివ్ కామెంట్లు వినిపిస్తుంటాయి. అయితే చాలా మంది మాత్రం రష్మి చేసే మంచి పనులను ప్రశంసిస్తుంటారు.
లాక్డౌన్ సమయంలోనూ మూగ జీవాల కోసం రోడ్డు మీదకు వచ్చింది రష్మి. వాటి ఆకలిని తీర్చేందుకు స్వయంగా రంగంలో దిగింది. ఎక్కడైనా మూగ జీవాలను ఎవరైనా హింసించాని, సహజంగా జరగాల్సిన వాటిని కృత్రిమంగా పక్షులు, జంతువులను హింసించి చేస్తుంటే వాటిపై స్పందించింది. తాజాగా అలాంటి ఓ ఘటనపై స్పందించింది. బర్రెలు సహజంగా ఎదగాలి గానీ వాటిని పుష్టిగా ఎదిగేందుకు ఇలా కట్టేసి, దాన్ని హింసించి ధృడంగా చేయడంపై రష్మి ఫైర్ అయింది.
గేదెలను కొందరు వెరైటీగా కట్టేసి వాటిని ఎదిగేలా చేస్తుంటారు. వాటి మెడ సాగేలా, పెద్దగా అయ్యేందుకు వెరైటీగా కట్టేస్తుంటారు.వాటిపై తాజాగా రష్మీ స్పందించింది. అలా మనం ఎందుకు చేయాలి.. అలా చేస్తే దానికి ఎంత బాధ కలుగుతుంది.. దయచేసి అలాంటివి చేసేముందు ఆలోచించండి.. ఎదగండి..ఇంకెన్నాళ్లు.. మనం మన జీవనశైలిని మార్చుకోకపోయినా పర్లేదు.. మరి ఇంత దారుణంగా ప్రవర్తించకుండా ఉంటే చాలు అని రష్మి మండిపడింది.