వరుసగా రెండు బాలీవుడ్ ఆఫర్లు.. కొత్త హీరోయిన్ రచ్చ మామూలుగా లేదు!!

Amrin Qureshi Got Two Chance In Bollywood

ఉత్తరాది వాళ్లు దక్షిణాదిన అవకాశాలు పొందడం, తెచ్చుకోవడం గొప్పేమీ కాదు. కానీ మనవాళ్లు ఉత్తరాదిన ఆఫర్లు పొందడం మాత్రం గొప్పే. అది కూడా మన హైద్రాబాద్ అమ్మాయి బాలీవుడ్‌లో రెండు సినిమాల్లో ఛాన్స్ దక్కించుకోవడం మామూలు విషయం కాదు. పుస్తకంలో కొన్ని పేజీలు మిస్సింగ్‌ డైరెక్టర్‌, ప్రొడ్యూసర్‌ సాజిద్‌ ఖురేషి కుమార్తె, రాయల్‌ ఫిలిం డిస్ట్రిబ్యూటర్స్‌ అధినేత ఎమ్‌.ఐ.ఖురేషి మనవరాలు అమ్రిన్‌ ఖురేషి ఒకే సారి రెండు బాలీవుడ్ చిత్రాలు అవి కూడా తెలుగులో హిట్ అయిన రీమేక్‌లో నటించడం గొప్ప విషయమే.

Amrin Qureshi Got Two Chance In Bollywood
Amrin Qureshi Got Two Chance In Bollywood

తెలుగులో బ్లాక్ బస్టర్స్ అయిన సినిమా చూపిస్త మావ, జులాయి చిత్రాలు బాలీవుడ్‌లో రీమేక్ కాబోతోన్నాయి. సినిమా చూపిస్త మావను బ్యాడ్ బాయ్‌గా రీమేక్ చేస్తున్నారు. ఈ రీమేక్‌ బాధ్యతలు బాలీవుడ్ దర్శకుడు రాజ్‌కుమార్‌ సంతోషి తీసుకున్నాడు. తాజాగా ఫస్ట్ లుక్ కూడా విడుదల చేశారు. అది బాగానే వైరల్ అవుతోంది. అయితే ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సమ్మర్‌లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

ఇక జులాయి రీమేక్‌కు ఇంకా పేరు ఫిక్స్ చేయలేదని తెలుస్తోంది. కానీ దర్శకుడు మాత్రం ఖరారు అయ్యాడు. టోని డిసౌజ ఈ రీమేక్‌ను తెరకెక్కిస్తున్నాడు. ఈ రెండు చిత్రాల్లో మన హైద్రాబాద్ అమ్మాయి హీరోయిన్‌గా నటిస్తోంది. బాలీవుడ్ స్టార్ మిథున్ చ‌క్ర‌వ‌ర్తి త‌న‌యుడు న‌మ‌షి చ‌క్ర‌వ‌ర్తి హీరోగా నటించనున్నాడు. మొత్తానికి మన కథలు, మన హీరోయిన్లు బాలీవుడ్‌లో జెండా పాతేస్తున్నారని వీటిని బట్టి తెలుస్తోంది. ఇప్పటికే మన తెలుగు కథలెన్నో అక్కడ కొన్ని వందల కోట్లు వసూళ్లు చేశాయి.