బిగ్ బాస్ హౌస్ లో భావోద్వేగాలు ఎక్కువవుతున్నాయి. చివరకు హోస్ట్ నాగార్జున కంట్లోంచి కన్నీటి చుక్కలు జాలువారుతున్నాయి. ఇప్పుడిప్పుడే హౌస్ లో ఎమోషన్స్ పెరిగిపోతున్నాయి.
శనివారం ఎప్పటిలాగే హోస్ట్ నాగార్జున ఇంటి సభ్యులను కలిశారు. కొన్ని టాస్కులు ఇచ్చారు. వాళ్లకు క్లాస్ పీకారు. గేమ్ ను ఎవ్వరూ సీరియస్ గా తీసుకోవడం లేదంటూ తలంటారు. అదంతా ఒక ఎత్తు కానీ.. జీరో ఆర్ హీరో గేమ్ లో మాత్రం హౌస్ మొత్తం ఎమోషనల్ అయిపోయింది.
ఇంటి సభ్యుల్లో ఎవరో ఒకరిని జీరో అనుకుంటే ఆ గేట్ నుంచి తోసేయాలంటూ నాగార్జున చెప్పగా.. దేవీ.. అమ్మరాజశేఖర్ మెడ పట్టుకొని అతడిని గేట్ లో నుంచి బయటికి నెట్టేసింది. ఆ తర్వాత కామెడీలు చేస్తే ఇక్కడ హీరోలా? అంటూ పంచ్ డైలాగ్ లు వేసింది.
దీంతో వెంటనే భావోద్వేగానికి గురయిన అమ్మ రాజశేఖర్ నేను వెళ్లిపోతాను సార్.. నేను ఉండను సార్.. పబ్లిక్ ప్లీజ్ నన్ను పంపించండి.. అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. దీంతో ఒక్కసారిగా నాగ్ కూడా ఎమోషనల్ అయ్యారు.
అయితే.. వెంటనే కల్పించుకున్న గంగవ్వ.. ఆయన ఎక్కడికి పోయేది లేదు.. ఆయన హౌస్ లో ఉండాల్సిందేనంటూ పట్టుబట్టారు. ఉండాల్సిందేనా.. అని నాగ్ కూడా గంగవ్వను అడిగారు..
దానికి సంబంధించిన ప్రోమోను తాజాగా మాటీవీ విడుదల చేసింది. అసలు హౌస్ లో ఏం జరిగింది అనేది తెలియాలంటే శనివారం రాత్రి ప్రసారమయ్యే బిగ్ బాస్ ఎపిసోడ్ చూడాల్సిందే.