నితిన్‌కు డ్యాన్స్ రాదు.. అతను బాగుపడడు.. డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు?

యంగ్ హీరో నితిన్ కు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు, ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. గత కొన్నేళ్లుగా సరైన సక్సెస్ లేని నితిన్ మరో నెల రోజుల్లో మాచర్ల నియోజకవర్గం సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ సినిమాలో తన అభిమానులకు నచ్చేలా డ్యాన్స్ చేశానని నితిన్ ఇప్పటికే స్టేట్ మెంట్ ఇచ్చారనే సంగతి తెలిసిందే. అయితే స్టార్ డైరెక్టర్ అమ్మ రాజశేఖర్ తాజాగా నితిన్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.

హీరో నితిన్ కు డ్యాన్స్ రాదని నితిన్ కు డ్యాన్స్ నేర్పించిన మాస్టర్ ను నేనేనని ఆయన చెప్పుకొచ్చారు. అలాంటి నన్ను నితిన్ మరిచిపోయాడని ఆయన కామెంట్లు చేశారు. నితిన్ నన్ను చాలా నిరుత్సాహానికి గురి చేశాడని ఆయన చెప్పుకొచ్చారు. అమ్మ రాజశేఖర్ నితిన్ గురించి ఈ విధంగా షాకింగ్ కామెంట్లు చేయడానికి ముఖ్యమైన కారణమే ఉంది. అమ్మ రాజశేఖర్ హీరోగా, నిర్మాతగా ఒక సినిమా తెరకెక్కింది.

ఈ సినిమా ఈవెంట్ కు అమ్మ రాజశేఖర్ నితిన్ ను ఆహ్వానించారు. చాలా సంవత్సరాల క్రితం నితిన్, అమ్మ రాజశేఖర్ కాంబినేషన్ లో టక్కరి అనే సినిమా తెరకెక్కింది. సదా ఈ సినిమాలో హీరోయిన్ రోల్ లో నటించగా కమర్షియల్ గా ఈ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ ను సొంతం చేసుకోలేదు. ఈ సినిమా ద్వారా ఏర్పడిన పరిచయం వల్ల అమ్మ రాజశేఖర్ నితిన్ ను ఈవెంట్ కు ఆహ్వానించారు.

అయితే మొదట వస్తానని చెప్పిన ఈ హీరో ఆ తర్వాత హ్యాండిచ్చారు. నితిన్ వస్తాడని ఏవీ సిద్ధం చేసిన అమ్మ రాజశేఖర్ నితిన్ రాకపోవడంతో ఫీల్ కావడంతో పాటు నితిన్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యల గురించి నితిన్ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి. నితిన్ కు డ్యాన్స్ రాదని నేనే డ్యాన్స్ నేర్పానని అమ్మను, గురువును మరిచిపోయిన వాళ్లు బాగుపడరని అమ్మ రాజశేఖర్ షాకింగ్ కామెంట్లు చేయడం గమనార్హం.